Pawan Kalyan Pithapuram : పవన్ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్లాన్.. హాట్ హాట్‌గా పిఠాపురం పాలిటిక్స్

పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది.

Pawan Kalyan Pithapuram

Pawan Kalyan Pithapuram : కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పిఠాపురం నుంచి పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన కాసేపటికే.. పిఠాపురం ఇంఛార్జి వంగా గీత క్యాంప్ ఆఫీసుకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ ప్రకటనతో.. అప్రమత్తమైన వైసీపీ అందరినీ ఏకం చేసే పనిలో పడింది.

పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది. వీరిద్దరూ కాకపోయినా వంగా గీతను పవన్ కల్యాణ్ పై పోటీకి నిలపాలని చూస్తోంది. అయితే, గతంలోనూ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ముద్రగడ ప్రకటించారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉండాలో నిర్ణయించనుంది వైసీపీ.

ఇక, మరోవైపు పిఠాపురంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ ఎన్ వర్మ.. ఇవాళ కార్యకర్తలు అనుచరులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వర్మ సైతం వైసీపీకి టచ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీలోకి వెళ్లకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. గతంలో పిఠాపురం నుంచి వంగా గీత విజయం సాధించారు.

ఒకవేళ ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడు పోటీ చేసినా సపోర్ట్ ఇవ్వాలని వంగా గీత ప్లాన్ చేస్తున్నారు. అటు పవన్ పై ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనే చర్చ కూడా వచ్చింది. 2009లో ఇదే పిఠాపురం నుంచి వర్మ, వంగా గీత, ముద్రగడ పోటీ చేశారు. ఇప్పుడు వర్మతో టచ్ లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ వర్మ వైపీపీలోకి వెళితే ఈ ముగ్గురు పవన్ ను కట్టడి చేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.

Also Read : టీడీపీలో హైటెన్షన్.. ఆ 16 సీట్లలో అభ్యర్థులపై తీవ్ర ఉత్కంఠ, సీనియర్ల భవిష్యత్తు ఏంటి?

ట్రెండింగ్ వార్తలు