Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.36వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధరపై ఏకంగా రూ.36వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Apple iPhone 14 Plus : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసినప్పటికీ, ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ రూ. 89,900 ప్రారంభ ధరతో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఐఫోన్ 15 ప్లస్ లాంచ్ తర్వాత కంపెనీ ఈ ఐఫోన్ మోడల్ ధరను రూ. 10వేలు తగ్గించింది. కానీ, ప్రస్తుతం ఐఫోన్ 14 ప్లస్‌ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 36వేల తగ్గింపు తర్వాత కేవలం రూ. 30,999కి పొందవచ్చు.

Read Also : Realme C67 4G Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి C67 4జీ ఫోన్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

బ్యాంకు, కార్డు ఆఫర్లపై రూ. 1500 తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై రూ. 12,901 తగ్గింపు తర్వాత రూ. 66,999గా జాబితా అయింది. దాంతో పాటు, కొనుగోలుదారులు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1500 తగ్గింపును పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.65,499కి తగ్గింది. ఇది కాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 34,500 వరకు తగ్గింపును పొందవచ్చు.

Apple iPhone 14 Plus Rs 30,999 on Flipkart

అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కొనుగోలుదారులు ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ. 30,999కే సొంతం చేసుకోవచ్చు. గత ఏడాదిలో కొనుగోలుదారుల నుంచి ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఫోన్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్, ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ వైపు దృష్టిని ఆకర్షించింది.

సింగిల్ ఛార్జ్.. 26 గంటలు వస్తుంది :
ఐఫోన్ 14 ప్లస్ బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ అనే 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 13 ప్రో మోడల్‌లలో కనిపించే విధంగా స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఎ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 12ఎంపీ ప్రధాన సెన్సార్, అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 5జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. స్మార్ట్‌ఫోన్ 26 గంటల వరకు ఉంటుందని ఆపిల్ పేర్కొంది.

Read Also : Apple iPhone 16 Series : వీడియోల కోసం రాబోయే ఆపిల్ ఐఫోన్ 16లో స్పెషల్ బటన్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు