Apple iPhone 16 : అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. కొత్త లీక్ డేటా ఇదిగో..!

Apple iPhone 16 : ఇటీవలి లీక్‌ల ప్రకారం.. రాబోయే ఐఫోన్ 16 భారీ డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బేస్ మోడల్‌లు సాధారణ సైజుల్లో ఉండవచ్చు. ప్రో మోడల్‌లు కొంచెం భారీ ప్యానెల్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

Apple iPhone 16 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త ఐఫోన్ 16 మోడల్ రాబోతోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16 ఫీచర్లకు సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 మోడల్ పెద్ద డిస్‌ప్లేలతో రావచ్చని లీక్ డేటా వెల్లడించింది.

ఏది ఏమైనప్పటికీ.. కొత్త ఐఫోన్ బేస్ మోడల్‌లకు మాత్రమే ప్రామాణిక పరిమాణాన్ని కలిగి ఉంటుందని అంచనా. అయితే, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కొంచెం భారీ ప్యానెల్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. రాబోయే ఐఫోన్ 16 బ్యాటరీ లైఫ్ గురించి లీక్ డేటా ఏం సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం.

భారీ డిస్‌ప్లేతో ప్రో మోడల్స్ :

దక్షిణ కొరియా నివేదిక ప్రకారం.. ఎల్‌టీపీఎస్ 60హెచ్‌జెడ్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ వరుసగా 6.12 అంగుళాలు, 6.69 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉండవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 16 ఫోన్ సైజు సాధారణ ఐఫోన్ 15 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. కొన్ని ఫీచర్లలో ఏయే మార్పులు ఉండవచ్చు అనేది ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ, ప్రో మోడళ్లలో మరింత ముఖ్యమైన మార్పులు ఉండే అవకాశం ఉంది.

Read Also : WhatsApp AI chatbot : వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఏఐ చాట్‌బాట్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.27-అంగుళాల ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రో మాక్స్ (అల్ట్రా) 6.86-అంగుళాల (LTPO) స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 15ప్రోతో పోల్చి చూస్తే.. 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఐఫనో్ 15 ప్రో మ్యాక్స్ 6.7-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంది. కానీ, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్క్రీన్ పరిమాణం అసాధారణంగా పెద్దదిగా కనిపిస్తోంది.

Apple iPhone 16 offer

ఐఫోన్ 16లో గ్రాఫేన్ హీట్ సింక్ ఫీచర్లు :

మరో లీక్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ ప్రోటోటైప్ ఫొటోలను వెల్లడించింది. ఈ ఫొటోలు తుషార మెటాలిక్ షెల్, బ్యాటరీ పరిమాణాన్ని ముందున్న వెర్షన్ కన్నా సుమారు 2.5 శాతం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ లీక్ కచ్చితమైనది అయితే.. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు బ్యాటరీలలో బ్లాక్ ఫాయిల్ కేసింగ్ మెటల్‌కు మారవచ్చు.

ఈ మార్పుతో డివైజ్ బరువును గణనీయంగా పెంచకుండా థర్మల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పటికే ఆపిల్ సిరీస్ 7 వంటి ఆపిల్ వాచ్‌లలో ఇలాంటి మార్పు చేసింది. థర్మల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి, అన్ని ఐఫోన్ 16 మోడల్‌లు గ్రాఫేన్ హీట్ సింక్‌లను కలిగి ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ హీట్ సింక్‌లు ఉష్ణ వాహకత ఫీచర్లను కలిగి ఉంటాయి. తద్వారా రాబోయే ఐఫోన్లలో హీటింగ్ సమస్యను సాధ్యమైనంతవరకు తగ్గిస్తాయి.

Read Also : Apple iPhone RAM : మీ ఆపిల్ ఐఫోన్ స్లో అయిందా? ర్యామ్ ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

ట్రెండింగ్ వార్తలు