Top Mobile Plans : ఎయిర్‌టెల్, జియో ప్లాన్లతో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Top Mobile Plans : ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ల కింద మరిన్ని ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

Top Mobile Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ బండిల్‌తో తన మొదటి ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ అందించే మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే మరికొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. అంతేకాకుండా.. రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నుంచి అలాంటి అన్ని ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

Read Also : OnePlus Nord CE 3 5G : భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడు ఎంతో తెలుసా?

ఎయిర్‌టెల్ రూ. 1,199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
రూ. 1,199 నెలవారీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్, 150జీబీ డేటా, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మొత్తం పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన ప్లాన్. ఈ ప్లాన్ 200జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో వస్తుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అలాగే, యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

Mobile plans from Airtel, Reliance Jio 

ఎయిర్‌టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ. 1,499 కొత్తగా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్.. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. దీని ధర రూ. 199 ఉంటుంది. ఇది కాకుండా, ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100ఎస్ఎంఎస్, 3జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 100జీబీ డేటా, 3 అదనపు సిమ్ కనెక్షన్‌లు, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ప్రతి రెండో సిమ్‌కు అదనపు 5జీబీ డేటా పొందవచ్చు.

రిలయన్స్ జియో రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
జియో రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా రోల్‌ఓవర్, నెట్‌ఫ్లిక్స్ (మొబైల్), అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో రూ. 1,099 నెట్‌ఫ్లిక్స్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. దీని ధర రూ. 149కు పొందవచ్చు. ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 2జీబీ రోజువారీ డేటా కూడా ఉన్నాయి. అదనంగా, జియో ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) ప్లాన్‌తో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 3జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

Read Also : Infinix Hot 40i Launch : ఇన్పినిక్స్ హాట్ 40ఐ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు