WhatsApp Online Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ కాంటాక్టుల్లో ఆన్‌లైన్‌లో ఉన్నవారిని ఒకేచోట చూడొచ్చు!

WhatsApp Online Status : వాట్సాప్ ఇటీవల యాక్టివ్ కాంటాక్ట్‌లను జాబితా రూపంలో చూపించే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఫీచర్ అందుబాటులోకి రానుంది.

WhatsApp Online Status : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గత కొన్ని నెలలుగా అనేక ఫీచర్లపై పనిచేస్తోంది. కాంటాక్టుల ఫీచర్‌తో కొత్తవారితో చాట్ చేయడం లేదా అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి భారతీయ యూజర్లను అనుమతించడం వంటివి కావచ్చు. ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. వాట్సాప్ స్టోర్‌లో మరో ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ముందుగా ఎవరికి టెక్ట్స్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఇటీవల ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్టుల జాబితాను మీకు చూపే ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని నివేదిక పేర్కొంది.

పోర్టల్ స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఇటీవల ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా ఉన్న కాంటాక్టుల జాబితాను సూచిస్తుంది. ఇటీవల ఆన్‌లైన్‌లో ఉన్న కొన్ని ఎంపిక చేసిన కాంటాక్టులను మాత్రమే ఈ జాబితాలో చూపిస్తుందని గమనించాలి. వాట్సాప్ ఇటీవల ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో, మీ టెక్స్ట్‌లకు రిప్లే ఇవ్వడం లేదా ముందుగా మీ కాల్‌లను పికప్ చేసే అవకాశం ఉన్నవారిని చెక్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫీచర్ ప్రతి కాంటాక్టు యాక్టివిటీ స్టేటస్ వ్యక్తిగతంగా చెక్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. తద్వారా యూజర్ల మెసేజ్ ఎక్స్‌పీరియన్స్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

అతి త్వరలో యూజర్లందరికి :
యూజర్ల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని జాబితాలలో యూజర్లు చివరిగా చూసిన ఆన్‌లైన్ స్టేటస్ చూపదని పేర్కొంది. ప్రస్తుతానికి, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసే ఆప్షన్ పొందిన బీటా టెస్టర్‌ల గ్రూపునకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో యూజర్లందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. వాట్సాప్ నివేదిక ప్రకారం.. ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లతో ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది.

యూజర్ కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచుకోవచ్చు. చాట్‌ల జాబితా దిగువన ఈ ఫీచర్ యూజర్లను చాట్‌లకు అంతరాయం కలిగించకుండా కొత్త చాట్ అప్రయత్నంగా యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ కొత్త చాట్‌ల కోసం సూచనలు వద్దనే యూజర్లు చాట్‌ల జాబితా దిగువన ఉన్న ప్రత్యేక విభాగాన్ని క్లోజ్ చేయడం ద్వారా సులభంగా స్టాప్ చేయొచ్చు. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. రాబోయే యాప్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్ కనిపించవచ్చు.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై చాట్‌లో డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయకుండానే చూడొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు