Delhi Fire Incident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

అగ్నిప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Delhi Fire Accident

Fire Accident Paint Factory : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని అలీపూర్ లోని పెయింట్స్, కెమికల్ గోడౌన్ లలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే 22 ఫైరింజన్లు సంఘటనా స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అర్థరాత్రి తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పలు నివాసాల గోడలు కూడా దెబ్బతిన్నాయి. మృతుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని పరిస్థితులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను మార్చరీకి తరలించారు. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : కుదరని ఏకాభిప్రాయం.. రైతు సంఘాలతో కేంద్రం చర్చలు విఫలం.. మళ్లీ ఎప్పుడంటే?

అగ్నిప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెట్ల మార్గం నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో లోపల ఉన్న కార్మికులు తప్పించుకోలేక పోయినట్లు స్థానిక అధికారి తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మంటల వ్యాప్తికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉంటే.. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అతుల్ గార్డ్ వివరాలప్రకారం.. మరో ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారని తెలిపారు.

Also Read : వెయ్యి కోట్లకు పైగా ప్రజాధ‌నం దుర్వినియోగం..! కాగ్ రిపోర్టులో సంచలనం

ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సుమిత్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు శబ్దం విని అందరూ ఇక్కడకు చేరుకున్నామని, మేము మమంటలను ఆర్పడానికి ప్రయత్నించే సమయంలో తొలుత 7నుంచి 8 అగ్నిప్రమాక యంత్రాలు ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపుచేసే చర్యలు ప్రారంభించాయని, అయిన మంటలు అదుపులోకి రాకపోవటంతో ఆ తరువాత మరికొన్ని అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయని చెప్పారు.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు