India vs England Test Series : ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే.. కోహ్లీని ఎందుకు పక్కన పెట్టారంటే?

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.

Teamindia

TeamIndia Squad : ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లు జరిగాయి. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. విశాఖ పట్టణంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ప్రస్తుతం రెండు జట్లు 1-1 పాయింట్లతో సమఉజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్ల మధ్య మరో మూడు టెస్ట్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఆ మూడు మ్యాచ్ లకు బీసీసీఐ తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది.

మొత్తం 17మంది సభ్యులతో ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కోహ్లీ వచ్చే మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాలవల్ల మిగిలిన సిరీస్ లకు కోహ్లీని ఎంపిక చేయడం లేదని, కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టులో ఎంపికైనప్పటికీ.. ఇద్దరూ బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ పొందిన తరువాతే తుది జట్టులోకి వస్తారని బీసీసీఐ తెలిపింది. ఇదిలాఉంటే ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మహ్మద్ సిరాజ్ మిగతా టెస్టులకు అందుబాటులోకి వచ్చేశాడు. గాయం కారణంగా శ్రేయస్ ను మూడు టెస్టులకు ఎంపిక చేయలేదు. కొత్తగా ఆకాశ్ దీప్ జట్టులో ఎంపికయ్యాడు.

Also Read : IND vs AUS: ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చేసింది.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్లు ఫైనల్స్‌లో ఎన్నిసార్లు తలపడ్డాయి? పూర్తి వివరాలు ఇలా ..

మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ర్పిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజిత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషిగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

Also Read : Pathum Nissanka : వ‌న్డేల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ.. గేల్‌, సెహ్వాగ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన నిస్సాంక‌

మూడో టెస్టు : ఫిబ్రవరి 15 -19 (రాజ్ కోట్)
నాల్గో టెస్టు : ఫిబ్రవరి 23 – 27 (రాంచీ)
ఐదో టెస్టు : మార్చి 7 నుంచి 11 (ధర్మశాల)

ట్రెండింగ్ వార్తలు