Pathum Nissanka : వ‌న్డేల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ.. గేల్‌, సెహ్వాగ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన నిస్సాంక‌

వ‌న్డే క్రికెట్‌లో మ‌రో ద్విశ‌త‌కం న‌మోదైంది.

Pathum Nissanka Double Century

Pathum Nissanka Double Century : వ‌న్డే క్రికెట్‌లో మ‌రో ద్విశ‌త‌కం న‌మోదైంది. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంక 136 బంతుల్లోనే డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో ద్విశ‌త‌కం సాధించిన మొద‌టి శ్రీలంక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. అంతేకాదు వ‌న్డేల్లో అత్యంత వేగంగా డ‌బుల్ సెంచ‌రీ చేసిన మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో అత‌డు క్రిస్‌గేల్‌, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. గేల్ 138 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 140 బంతుల్లో ద్విశ‌త‌కాల‌ను అందుకున్నారు.

మూడు వ‌న్డే మ్యాచుల సిరీస్‌లో భాగంగా పల్లెకెలె వేదిక‌గా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 381 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ నిస్సాంక ఈ మ్యాచ్‌లో మొత్తం 139 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది 210 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

David Warner : చ‌రిత్ర సృష్టించిన డేవిడ్ వార్న‌ర్‌.. ఆసీస్ క్రికెట‌ర్ల‌లో ఒకే ఒక్క‌డు..

అత‌డితో పాటు అవిష్క ఫెర్నాండో (88; 88 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా సదీర సమరవిక్రమ (45; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) రాణించాడంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫరీద్ అహ్మద్ మాలిక్ రెండు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ న‌బీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

జ‌య‌సూర్య రికార్డు బ‌ద్ద‌లు..

శ్రీలంక త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా ఇప్ప‌టి వ‌ర‌కు స‌న‌త్ జ‌య‌సూర్య పేరు ఉండేది. 2000లో భార‌త్ పై జ‌య‌సూర్య 189 ప‌రుగులు చేశాడు. దాదాపు 24 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న ఈ రికార్డును తాజాగా నిస్సాంక బ‌ద్ద‌లు కొట్టాడు.

IND vs ENG : మూడో టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్‌..! మిగిలింది రోహిత్ శ‌ర్మ మాత్ర‌మే!

ఇదిలా ఉంటే.. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడి రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిషన్ 126 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ పై 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన గ్లెన్ మాక్స్‌వెల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఓవరాల్‌గా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 10వ బ్యాటర్‌గా నిస్సాంక నిలిచాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్య‌ధికంగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్, క్రిస్ గేల్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, గ్లెన్ మాక్స్‌వెల్ లు వన్డే క్రికెట్‌లో డ‌బుల్ సెంచ‌రీ బాదారు.

ట్రెండింగ్ వార్తలు