T20 World Cup 2026 : సోహైబ్ ఖాన్ హాఫ్ సెంచరీ.. అఫ్గానిస్థాన్ లక్ష్యం 161 రన్స్..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్, యూఏఈ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరుగుతోంది.
T20 World Cup 2026 AFG vs UAE Afghanistan Target is 161
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్, యూఏఈ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దీంతో అఫ్గానిస్థాన్ ముందు 161 పరుగుల లక్ష్యం నిలిచింది.
UAE accumulate 1️⃣6️⃣0️⃣ in their batting essay.
Led by Sohaib Khan’s brilliant half ton with able support from Alishan Sharafu, 🇦🇪 put up a good total on a tough wicket.
On to the bowlers to work their magic and push for successive wins! 💪#UAE #T20WorldCup #FeelTheThrill… pic.twitter.com/5Buy8iAoyT— UAE Cricket Official (@EmiratesCricket) February 16, 2026
యూఏఈ బ్యాటర్లలో సోహైబ్ ఖాన్ (68; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అలీషన్ షరాఫు (40; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. కెప్టెన్ ముహమ్మద్ వసీం (10), ఓపెనర్ ఆర్యన్ష్ శర్మ (0)లు విఫలం అయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు తీశాడు. ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించాడు.
ఈ మెగాటోర్నీలో గ్రూప్-డిలో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు గెలుపు బోణీ కొట్టలేదు. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడగా రెండింటిలోనూ ఓడిపోయింది. యూఏఈ పైనా గెలిచి గెలుపు బోణీ కొడుతుందో లేదో చూడాల్సిందే.
