TMC Recruitment : విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దీనిప్రకారం పోస్టులననుసరించి పదోతరగతి, డిప్లొమా/గ్రాడ్యుయేషన్/బీఎస్సీ/జీఎన్ఎం/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

TMC Recruitment : భారత ప్రభుత్వ గుర్తింపు కలిగిన విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో నర్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఐటీ అసిస్టెంట్ కంప్యూటర్ ప్రోగ్రామర్, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్), అడ్మిన్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దీనిప్రకారం పోస్టులననుసరించి పదోతరగతి, డిప్లొమా/గ్రాడ్యుయేషన్/బీఎస్సీ/జీఎన్ఎం/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అక్టోబరు 6 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిచనున్నారు. విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ సమయం విషయానికి వస్తే ఉదయం 9:30 నుంచి ఉదయం 11 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tmc.gov.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు