CSK : ప్లే ఆఫ్స్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్‌.. స్వ‌దేశానికి వెళ్లిపోయిన‌ స్టార్ పేస‌ర్‌..

చెన్నై సూప‌ర్ కింగ్స్ కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది.

Chennai Super Kings : చెన్నై సూప‌ర్ కింగ్స్ కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మతీషా పతిరానా మిగిలిన ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న ఈ పేస‌ర్.. గాయం నుంచి కోలుకునేందుకు స్వ‌దేశం శ్రీలంక‌కు బ‌య‌లేర్ద‌నున్నాడు.

ఈ క్ర‌మంలో ఆదివారం ధ‌ర్మ‌శాల‌ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ అత‌డు బ‌రిలోకి దిగ‌లేదు. కీల‌కమైన ప్లే ఆఫ్స్ మ్యాచుల ముందు ప‌తిరానా దూరం కావ‌డం సీఎస్‌కే విజ‌యావ‌కాశాల‌ను ప్ర‌భావం చేయొచ్చు.

Shivam Dube : ఏంద‌య్యా దూబె ఇదీ.. రింకూ కాద‌ని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సెల‌క్ట్ చేస్తే.. బ్యాటింగ్ మ‌రిచిపోయావా ఏందీ?

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్‌కే త‌రుపున ప‌తిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకాన‌మీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో గాయ‌ప‌డ‌డంతో ఆర్‌సీబీతో జ‌రిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.

ఇప్ప‌టికే జింబాబ్వేతో సిరీస్ కోసం ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్వ‌దేశం వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌కు చెందిన 36 ఏళ్ల రిచర్డ్ గ్లీసన్ మాత్ర‌మే చెన్నై జ‌ట్టులో ప్ర‌స్తుతం ఉన్న ఏకైక విదేశీ ఫాస్ట్ బౌల‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం.

RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జ‌ర‌గాల్సిందే

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా (43; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

అజింక్యా ర‌హానే (9), శివ‌మ్ దూబె (0), మోయిన్ అలీ (17), ఎంఎస్ ధోని (0) లు విఫ‌లం అయ్యారు. పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ల‌లో రాహుల్ చాహ‌ర్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ లు చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సామ్ క‌ర్రాన్ ఓ వికెట్ సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు