AP POLYCET Final Answer Key : త్వరలో ఏపీ పాలిసెట్-2024 ఫలితాలు.. ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

AP POLYCET Final Answer Key : ఏపీ పాలిసెట్ ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మే 5, 2024న ఫైనల్ ఆన్సర్ కీని ఎస్బీటీఈటీ విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP POLYCET Final Answer Key : స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఈరోజు (మే 5, 2024న) ఏపీ పాలిసెట్ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ (apsbtet.ap.gov.in) నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేట్/II షిఫ్ట్ పాలిటెక్నిక్‌లలో ప్రవేశానికి గత ఏప్రిల్ 27న ఎస్బీటీఈటీ పరీక్ష నిర్వహించింది. ఏప్రిల్ 30న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. విద్యార్థులు తమ అభ్యంతరాలను మే 4, 2024 వరకు అనుమతించింది. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఫైనల్ ఆన్సర్ కీ ఇప్పటికే విడుదల కాగా.. రాబోయే వారాల్లో ఫలితాలు పొందవచ్చు.

ఏపీ పాలిసెట్ ఫైనల్ ఆన్సర్ కీ.. ఎలా తనిఖీ చేయాలి? :

  • అధికారిక వెబ్‌సైట్‌ (apsbtet.ap.gov.in) నోటిఫికేషన్ సెక్షన్‌కు వెళ్లండి.
  • “SBTET AP – POLYCET-2024 – ఫైనల్ కీ Reg” అని ఉన్న లింక్‌ని ఎంచుకోండి.
  • ఫైనల్ ఆన్సర్ కీ (pdf) మీ ల్యాప్‌టాప్/స్క్రీన్‌లో అందుబాటులో ఉంటుంది.
  • పీడీఎఫ్ ఓపెన్ చేసి ఆన్సర్ కీ ఫలితాలను చెక్ చేసుకోండి.

ఏపీ పాలిసెట్ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్‌లో జరిగింది. పేపర్‌లో 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉండగా మాత్రమే సరైన సమాధానం ఇవ్వాలి. మ్యాథ్స్‌లో 50, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 30 ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కు లేదు. పరీక్ష 2 గంటలపాటు జరిగింది. అభ్యర్థులు సరైన సమాధానాన్ని ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR) రెస్పాన్స్ షీట్‌లో డార్క్‌లో 2B పెన్సిల్‌తో మాత్రమే డార్క్‌లో షేడ్ చేసి గుర్తించవలసి ఉంటుంది.

Read Also : CBSE Exam 2024 Results : సీబీఎస్ఈ బోర్డు పరీక్ష 2024 ఫలితాలు.. మేలో ఎప్పుడైనా ప్రకటించే ఛాన్స్!

ట్రెండింగ్ వార్తలు