SSC Constable GD Recruitment: 25వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్..
BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.gov.in.
SSC Constable GD Recruitment: సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD- జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు సంబంధించి బిగ్ అప్ డేట్. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య 25వేల 487. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.gov.in.
* ఆన్ లైన్ లో ఫీజు చెల్లించేందుకు 2026 జనవరి 1 లాస్ట్ డేట్
* బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో మొత్తం పోస్టులు 616 (పురుషులు 254, మహిళలు 92)
* సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ – మొత్తం పోస్టులు – 14,595 (పురుషులు 13,135.. మహిళలు 1,460)
* సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ – మొత్తం పోస్టులు – 5490 (పురుషులు 5366, మహిళలు 124)
* సహస్త్ర సీమా బల్ – మొత్తం పోస్టులు – 1764 (మహిళలు-0)
* ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ – 1293 (పురుషులు – 1099, మహిళలు – 194)
* అస్సాం రైఫిల్స్ – 1706 (పురుషులు – 1556, మహిళలు – 150)
* సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం పోస్టులు 23 (మహిళలు-0)
మొత్తం పోస్టుల సంఖ్య – 25వేల 487 (పురుషులు-23,4677.. మహిళలు-2,020)
అర్హతలు..
* అభ్యర్థులు భారత పౌరులు అయి ఉండాలి. జనవరి 1 2026 నాటికి గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్/10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
* వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు (జనవరి 2, 2003 – జనవరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ..
* కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
* ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్
* ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
* మెడికల్ ఎగ్జామినేషన్
* డాక్యుమెంట్ వెరిఫికేషన్
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ (0.25) ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష.
జీతం – రూ.21,700 నుంచి రూ.69,100
డిటైల్డ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఓరి నాయనో.. పానీపూరీ తిందామని తెరిచిన నోరు.. మళ్లీ మూసుకోలేదు.. ఎందుకిలా..?
