Mohammad Amir : ఫిక్స‌ర్ ఫిక్స‌ర్ అంటూ అరుపులు.. కోపంతో ఊగిపోయిన అమీర్‌.. వీడియో వైర‌ల్‌

పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ అమీర్ ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు

Mohammad Amir Has Heated Exchange With Fan Over Fixer Chants During PSL 2024 Match

Mohammad Amir – PSL 2024 : పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ అమీర్ ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో చోటు చేసుకుంది. క్వెట్టా గ్లాడియేట‌ర్స్ కు అమీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం క‌రాచీలోని నేషనల్ స్టేడియంలో లాహోర్ క్వాలండర్స్‌, క్వెట్టా గ్లాడియేటర్స్ త‌ల‌ప‌డ్డాయి. ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ క్వాలండర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

167 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన గ్లాడియేటర్స్ విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి నాలుగు ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. మహ్మద్ వసీం జూనియర్ బౌండరీ కొట్టి జట్టును గెలిపించాడు.

Rishabh Pant : శుభ‌వార్త‌.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకట‌న‌

వైర‌ల్ అవుతున్న వీడియోలో మైదానంలోకి అమీర్ వెలుతున్న స‌మ‌యంలో అత‌డిని చూసి అభిమానులు ఫిక్స‌ర్ ఫిక్స‌ర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అమీర్ తీవ్ర అస‌హ‌నానికి గురైయ్యాడు. ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మీరు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అంటూ ప్ర‌శ్నించాడు.

2010లో పాకిస్తాన్ జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఓ టెస్టు మ్యాచ్‌లో అమీర్ కావాల‌నే వ‌రుస‌గా రెండు నోబాల్స్ వేశాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తేల‌డంతో అత‌డిపై ఐదేళ్ల నిషేదం విధించింది. మూడు నెల‌ల జైలు జీవితం కూడా గ‌డిపాడు. 2015లో అత‌డి పై నిషేదం పూర్తి కావ‌డంతో మ‌ళ్లీ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ‌రుస‌టి ఏడాది జాతీయ జ‌ట్టుకు సైతం ఆడాడు. 2019లో టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకున్న అమీర్ 2020లో అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అయితే.. ప్రాంఛైజీ క్రికెట్ లీగులు ఆడుతూనే ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ స్పాట్ ఫిక్సింగ్ మ‌ర‌క‌లు అమీర్ ను వ‌ద‌ల‌లేదు. అభిమానులు అత‌డిని వెక్కిరిస్తూనే ఉన్నారు.

PSL 2024 : అంపైర్‌తో నీకెందుకు సికింద‌ర్ మామ‌.. మ‌ధ్య‌లో వేలుపెడితివి! ఇప్పుడు చూడు..

ట్రెండింగ్ వార్తలు