PSL 2024 : అంపైర్‌తో నీకెందుకు సికింద‌ర్ మామ‌.. మ‌ధ్య‌లో వేలుపెడితివి! ఇప్పుడు చూడు..

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2024లో ప‌లువురు ప్లేయ‌ర్లు నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘింస్తున్నారు.

Sikandar Raza

PSL 2024 – Sikandar Raza : పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2024లో ప‌లువురు ప్లేయ‌ర్లు నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘింస్తున్నారు. దీంతో వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాక్ పేస‌ర్ న‌సీం షా వికెట్ల‌ను కాలితో త‌న్న‌డంతో అత‌డి మ్యాచ్ ఫీజులో 10 జ‌రిమానా విధించ‌గా తాజాగా లాహోర్ ఖలంద‌ర్స్ కు ఆడుతున్న జింబాబ్వే ఆట‌గాడు సికింద‌ర్ ర‌జాకు కూడా ఫైన్ ప‌డింది. అత‌డు అంపైర్ నిర్ణ‌యంపై ప‌లుమార్లు అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతో జ‌రిమానా విధించారు.

ఆదివారం లాహోర్ ఖలందర్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జ‌రిగింది. ఆర్టిక‌ల్ 2.8ని లాహోర్ ఖలంద‌ర్స్ కు ఆడుతున్న జింబాబ్వే ఆట‌గాడు సికింద‌ర్ ర‌జా ఉల్లంఘించాడు. దీనిపై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, రషీద్ రియాజ్ అభియోగాలు మోపగా మ్యాచ్ రిఫరీ అలీ నఖ్వీ కూడా ర‌జా త‌ప్పుచేసిన‌ట్లు తేల్చాడు. దీంతో సికింద‌ర్ ర‌జా మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానాగా విధించాడు.

Hardik Pandya : ప్లేయ‌ర్‌గా వెళ్లాడు.. కెప్టెన్‌గా తిరిగొచ్చాడు.. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో పాండ్య రీ ఎంట్రీ అదుర్స్‌..

ఈ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో రజా మూడు వేర్వేరు సందర్భాలలో తన చేతులను పైకెత్తి, తల ఊపుతూ, డెలివరీని వైడ్ బాల్ అని సూచిస్తూ సైగ చేశాడు. రజాకు విధించిన జరిమానాను సంబంధించి పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. “అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాన్ని చూపినందుకు హెచ్‌బిఎల్ పిఎస్‌ఎల్ ప్రవర్తనా నియమావళిని లెవెల్ 1 ఉల్లంఘించినందుకు లాహోర్ ఖలందర్స్ సికందర్ రజాకు అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించబడింది.” అని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లాహోర్ ఖలందర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసింది. ఖ‌లంద‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అబ్దుల్లా షఫీక్(59; 39 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స‌ర్లు), కెప్టెన్ షాహీన్ అఫ్రిది(55; 34బంతుల్లో 2ఫోర్లు, 4సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాలు బాదారు. అనంత‌రం సౌద్ షకీల్ (88నాటౌట్; 65 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) విజృంభించ‌డంతో ల‌క్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి ఛేదించింది.

PSL 2024 : మ‌రీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమ‌న్నాయ్ చెప్పు.. ఫ‌లితం అనుభ‌వించావుగా

ట్రెండింగ్ వార్తలు