Elon Musk: గెట్ రెడీ.. బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ గురించి వెల్లడించనున్న ఎలన్ మస్క్

ఎలన్ మస్క్ సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మెదడుపై పరిశోధనలు జరుపుతోంది ఈ సంస్థ. అయితే, ఏ పరిశోధనలు చేస్తోంది.. ఈ కంపెనీ సాధించి ప్రగతి ఏంటి వంటి వివరాలు ఇంకా తెలియవు. ఇప్పుడా వివరాల్నే వెల్లడించబోతున్నాడు ఎలన్ మస్క్.

Elon Musk: టెక్ రంగంలో ఎలన్ మస్క్‌ది ప్రత్యేక స్థానం. సెల్ఫ్ డ్రైవింగ్, ఎలక్ట్రిక్ కార్ల రంగంలో అయినా.. అంతరిక్ష పరిశోధనా రంగంలో అయినా.. శాటిలైట్‌తో పని లేకుండా ఇంటర్నెట్ సేవలు అందించే టెక్నాలజీ అయినా ఎలన్ మస్క్ కొత్తగా ఆలోచిస్తాడు.

Shinde Camp MLAs: బీజేపీలోకి షిండే క్యాంపు ఎమ్మెల్యేలు.. త్వరలోనే వెళ్తారంటున్న ‘సామ్నా’

అయితే, ఇవి మాత్రమే కాకుండా… మరెన్నో పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో ఎలన్ మస్క్ కంపెనీలు పని చేస్తున్నట్లు సమాచారం. వీటిలో ‘న్యూరాలింక్’ ఒకటి. ఇది బ్రెయిన్ ఇంప్లాంట్‌పై పనిచేస్తున్న కంపెనీ. అంటే మెదడు పనితీరును పసిగట్టి, మరింత సమర్ధంగా పనిచేయించేందుకు గల అవకాశాల్ని కంపెనీ పరిశీలిస్తోంది. నిజానికి ‘న్యూరాలింక్’ కంపెనీ ఏం పరిశోధనలు చేస్తుంది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కొన్ని వివరాల్ని అప్పుడప్పుడు ఎలన్ మస్క్ వెల్లడించాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఈ సంస్థ మెదడు పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాటి వివరాల్ని నమోదు చేస్తుంది. ఈ వివరాల ద్వారా వీరు తయారు చేయబోయే బ్రెయిన్ చిప్స్‌ను మనిషి మెదడులో అమరిస్తే, మనిషి మరింత తెలివిగలవాడుగా తయారవుతాడు. అలాగే పక్షవాతం వచ్చిన వారు కూడా తిరిగి నడవగలుగుతారు.

Mumbai Businessman: అమ్మాయిని ‘ఐటమ్’ అన్న వ్యాపారి.. జైలు శిక్ష విధించిన కోర్టు

ఇప్పటికే క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో కోతి మెదడులో వీటిని అమర్చి, పరిశీలించారు. త్వరలో మానవుల మెదడుపై కూడా ప్రయోగాలు చేసేందుకు న్యూరాలింక్ సంస్థ ప్రయత్నిస్తోంది. మనిషి మెదడును, కంప్యూటర్‌తో నేరుగా అనుసంధానం చేయాలనేది కూడా ఎలన్ మస్క్ లక్ష్యం. ఈ విషయంలో న్యూరాలింక్ సంస్థ సాధించిన ప్రగతి.. చేస్తున్న పరిశోధనలకు సంబంధించిన వివరాలు ఇంతకుమించి తెలియవు. అందుకే ఈ సంస్థకు సంబంధించిన వివరాల్ని నవంబర్ 30న వెల్లడిస్తానని ఎలన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

 

ట్రెండింగ్ వార్తలు