Koreans Slim Secret : కొరియా అమ్మాయిల ‘స్లిమ్ సీక్రెట్’ ఇదే…

కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?స్లిమ్ గా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటీ..

Koreans Slim Secret : కొరియావాళ్లను ఎప్పుడైనా పరిశీలించారా? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. వాళ్ల ముఖంలో ఒకరకమైన మెరుపు ఉంటుంది. అంటే వారి శరీరం కాంతివంతంగా ఉంటుంది. అందేకాదు వారు లావుగా ఉండరు. చక్కటి ఫిట్ నెస్ తో సన్నగా స్లిమ్ గా ఉంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చక్కగా క్యూట్ గా ప్లంజెంట్ గా నాజూకుగా ఉంటారు. అందుకే కొరియా సీరియల్, పాప్ స్టార్స్, మోడల్స్ ను మన దేశం వాళ్లు విపరీతంగా ఇష్టపడుతుంటారు. మరి కొరియావారికి ఇంతటి అందం..నాజూకుదనం ఎలా వచ్చింది? ఎందుకు వారు అంత స్లిమ్ గా యాక్టివ్ గా ఉంటారు? వారి స్లిమ్ వెనుక ఉన్న ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.

ఊబకాయంతో కనిపించే కొరియన్లు చాలా అరుదుగా కనిపిస్తారు. 60-70 ఏళ్లు దాటినవారు కూడా చక్కటి శరీరసౌష్టవంతో చక్కగా కనిపిస్తారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొరియన్ మహిళల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీరి శరీరాకృతి ఎంతో మందిలో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొరియన్ మహిళలు సన్నగా ఉండేందుకు వీరు ఏం తింటారో తెలుసుకుందాం…వారు తినే ఆహారమేంటీ? వారి అలవాట్లు ఏంటో తెలుసుకుందాం..

Read more : Coconut Oil : జుట్టు, చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె

1. సమతులాహారం తింటారు
కొరియన్ మహిళలు తీసుకునే ఆహారం సమతులంగా ఉంటుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల నుంచి కొవ్వు వరకు కొరియన్ల ఆహారంలో అన్ని ఉంటాయి. అలాగని అతిగా తినరు. పరిమితంగా తింటారు. చిన్నచిన్న మీల్స్ రూపంలో తీసుకుంటారు. పొట్టనిండా తిని కూర్చోవడం, నిద్రపోవడం వంటివి అస్సలు చేయరు. తినే ఆహారానికి తగినట్లుగా శారీరక శ్రమ చేస్తారు. వారి దినచర్యలో సమతుల ఆహారం..శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు.

2. ఆహారంలో కూరగాయలే ప్రధానం..
మీరు ఎప్పుడైనా కొరియన్ వంటకాలను పరిశీలించారా?లేదంటే ఈసారి తప్పకుండా పరిశీలించండీ..ఎందుకంటే వారి ఆహారంలో ఎక్కువగా కూరగాయలే కనిపిస్తాయి. కూరగాయలలో పీచు, తక్కువకేలరీలు ఉంటాయి. ఇవి ఎంత తిన్నా బరువు పెరగరు. అందులోనూ ఆయిల్ లో అధికంగా డీప్ ఫ్రై చేసిన కూరగాయలు కావవి. కాబట్టి అధికకేలరీలు కూడా శరీరంలో చేరవు. దీంతో శరీరం కొవ్వు పేరుకునే సమస్యే ఉండదు.

Read more : Mental Stress : మానసిక వత్తిడి దూరంకావాలంటే?..

3. పులియబెట్టిన పచ్చళ్లు, ఆహారాలే ముఖ్యం
కొరియన్ మహిళలు ‘కిమ్చి’ అని పిలిచే పులియబెట్టిన పచ్చళ్లను కచ్చితంగా తింటారు. అది లేకుండా వారి భోజనం పూర్తే కాదు. ఈ కిమ్చి పచ్చళ్లు వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఈ కిమ్చి ప్రేగులు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు ఈ పచ్చళ్లు తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుందట. అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

4. ఫాస్టు పుడ్ వద్దు..ఇంటి ఆహారానికే ముద్దు
ఇంట్లో తయారుచేసుకున్న ఆహారానికే కొరియన్ మహిళలు ప్రాధాన్యతనిస్తారు. ప్రాసెస్ చేసే ఆహారానికి, ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉంటారు. అంటే ఫాస్టు ఫుడ్ లకు దూరంగా ఉంటారు. ఏదైనా ఇంట్లో స్వయంగా వండుకుని తినటానికే ఇష్టపడతారు.కొరియన్ మహిళలు బయటఫడ్ తినటానికి అస్సలు ఇష్టపడరు.శరీరానికి మేలు చేసే ఆహారాల గురించి వారికి బాగా తెలుసుకుని..వాటినే తింటారు. ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేసుకుని మరీ తింటారు.

5. ఆరోగ్యాలనిచ్చే సీ ఫుడ్ అంటే ఇష్టం..
కొరియా మహిళలు ఎక్కువ సీ ఫుడ్ తింటారు. సముద్రపు చేపలలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అందుకే వీరు కొవ్వు ఉండే చేపలను అధికంగా తింటారు. కొవ్వులోనే కదా ఆమ్లాలు దొరికేది. అలాగే సీ వీడ్ అంటే సముద్రపు నాచు మొక్కల్ని కూడా తింటారు. విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే సీవీడ్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు గొప్పగా సహకరిస్తుంది.


6. కిలోమీటర్ల కొద్దీ నడక
కొరియన్ మహిళలు నడకకు అధిక ప్రాధాన్యతనిస్తారు. రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసులకు నడుచుకుని వెళ్లేందుకే ఇష్టపడతారు. అంతేతప్ప మనలాగా పక్క వీధిలో ఉన్న షాపుకు వెళ్లాలంటే వాహనాలపై అస్సలు వెళ్లరు. సాధ్యమైనంత వరకు నడవటానికే ఇష్టపడతారు. వారి ఆరోగ్యానికి..ఫిట్ నెస్ కు నాజూకుతనానికి నడక చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వారి చురుకైన జీవనశైలికి కారణం. అందుకే శరీరంలో అధిక బరువు పెరగడం లాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు.

ఇలా వారి ఆరోగ్యకరమైన వారి ఆహారపు అలవాట్లు..నడక..ఇలా ఎన్నో విషయాలలో చక్కటి అలవాట్లు కొనసాగిస్తారు కొరియా మహిళలు. అలాగే అబ్బాయిలు కూడా చక్కటి ఆరోగ్యపు అలవాట్లనే ప్రాధాన్యతనిస్తారు. అందుకే వారికి 60,70 ఏళ్లు నిండినా శరీరం చక్కటి చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు