×
Ad

Premikudu : ఒకే రోజు రెండు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్..

మే 1న ఒకే రోజు రెండు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

  • Published On : April 28, 2024 / 08:43 AM IST

Premikudu and Vakeelsaab Movie Re Released on Same Day

Premikudu Re Release : ఇటీవల సూపర్ హిట్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతివారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు పాత సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. మే 1న ఒకే రోజు రెండు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

ప్రభుదేవా, నగ్మా జంటగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాదలన్ ని తెలుగులో ‘ప్రేమికుడు’గా రిలీజ్ చేశారు. 1994లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికి రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. ఇక ప్రేమికుడు సినిమా రిలీజయి 30 ఏళ్ళు అవుతుండటంతో ఈ సినిమాని తెలుగులో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో ఈ సినిమాని నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Gangs of Godavari Teaser :‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ రిలీజ్.. అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్దంతే..

తాజాగా ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరగగా నిర్మాత మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 30 ఏళ్ళ తర్వాత ప్రేమికుడు సినిమాని 4K క్వాలిటీలో రీ రిలీజ్ చేస్తున్నాం. మే 1న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. ఆల్రెడీ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి అంగీకరించి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్మాతలు రమణ, లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన వకీల్ సాబ్ సినిమా కూడా అమ్మాయి 1న రీ రిలీజ్ కబవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా భారీ విజయం సదహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ సినిమాని రీ రిలీజ్ చేయడం చర్చగా మారింది.