Jabardasth Comedian Gully Boy Bhaskar shares his House Warming Ceremony Video
Gully Boy Bhaskar : పటాస్ షోతో టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్.. ఆ షోలో తన కామెడీతో మెప్పించి గల్లీ బాయ్ భాస్కర్ గా పాపులర్ అయ్యాడు. పటాస్ తర్వాత పలు టీవీ షోలతో మెప్పించి ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి షోలో స్కిట్స్ చేస్తూ జనాల్ని నవ్విస్తున్నాడు భాస్కర్. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్.. వీళ్లందరితో కలిసి జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తున్నాడు భాస్కర్.
Also Read : Kalki 2898AD : ప్రభాస్ కల్కి 2898AD రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ అదిరింది..
తాజాగా భాస్కర్ కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాను. నాకు సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు అని తెలిపాడు. ఇక ఈ వీడియోలో తన ఫ్యామిలీ పూజలు చేస్తున్న ఫోటోలు, తన ఇంటిని చూపించాడు. నెటిజన్లు, పలువురు ప్రముఖులు భాస్కర్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
భాస్కర్ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి పలువురు జబర్దస్త్ కమెడియన్స్, టీవీ ప్రముఖులు హాజరయ్యారు.