Kalki 2898AD : ప్రభాస్ కల్కి 2898AD రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ అదిరింది..

తాజాగా కల్కి మూవీ టీం నుంచి అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Kalki 2898AD : ప్రభాస్ కల్కి 2898AD రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ అదిరింది..

Prabhas Nag Ashwin Deepika Padukone Amitabh Kalki 2898AD Movie Release Date Announced

Updated On : April 27, 2024 / 5:36 PM IST

Kalki 2898AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మరోసారి ఎన్నికల వల్ల వాయిదా పడింది. ఇక కల్కి నుంచి గ్లింప్స్, ఇటీవల అమితాబ్ ‘అశ్వత్థామ’గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన కల్కి సినిమా రోజుకో కొత్త డేట్ వినిపిస్తుంది. తాజాగా కల్కి మూవీ టీం నుంచి అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జూన్ 27న కల్కి రిలీజ్ కాబోతుందని మూవీ యూనిట్ అధికారికంగా అప్రకటించింది. ఇక కొత్త పోస్టర్ లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకోన్ నిల్చొని ఉన్నారు. దీంతో కల్కి కొత్త వైరల్ గా మారింది.

ఇక కల్కి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, రానా.. పలువురు స్టార్స్ కల్కిలో నటిస్తుండగా మరికొంతమంది సెలబ్రిటీలు కూడా గెస్ట్ అప్పీరెన్స్ కనిపించబోతున్నారని సమాచారం. అయితే జూన్ 27 అంటే ఎలాంటి పండగలు లేని టైం, సెలవులు అయిపోయి పిల్లలు స్కూల్స్, కాలేజీకి వెళ్లే టైం, కేవలం వీకెండ్ తప్ప ఇంకెలాంటి స్పెషల్ లేదు. మరి ఆ సమయంలో భారీ బడ్జెట్ కల్కి రిలీజయి హిట్ అయినా అనుకున్న కలెక్షన్స్ వస్తాయా చూడాలి.