Woman’s Chair Break : సీఈఓతో వీడియో కాల్.. కుర్చీ విరిగి కిందపడింది అంతే… వీడియో వైరల్!

కరోనా సమయంలో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుల్లో మీటింగ్ లకు కూడా ఆన్ లైన్ లోనే హాజరవుతున్నారు. మహిళా ఉద్యోగులు.. ఒకవైపు ఇంట్లో పనులు చేసుకుంటూ మరోవైపు ఆఫీసు వర్క్ తో తెగ బిజీగా గడిపేస్తున్నారు.

Woman’s Chair Breaks During Office Video Call  : కరోనా సమయంలో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుల్లో మీటింగ్ లకు కూడా ఆన్ లైన్ లోనే హాజరవుతున్నారు. మహిళా ఉద్యోగులు.. ఒకవైపు ఇంట్లో పనులు చేసుకుంటూ మరోవైపు ఆఫీసు వర్క్ తో తెగ బిజీగా గడిపేస్తున్నారు. ఇంట్లోనే ఉండటంతో ఆఫీసుల్లో మాదిరిగా సౌకర్యవంతంగా ఉండదు.. మీటింగ్ సమయాల్లో మరి ఇబ్బందిగా మారుతుంటుంది. వర్చువల్ మీటింగ్ ద్వారా కనెక్ట్ కావాల్సి ఉంటుంది.

అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఫర్నీచర్ కంపెనీలోని సేల్స్ అసోసియేట్ చార్లెట్‌ కొజినెట్‌ (Charlotte Kozinets) మహిళా ఉద్యోగి కూడా వర్చువల్ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. మూడు రోజుల క్రితం తమ సీఈఓ నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ప్రాజెక్టుపై కొలిగ్స్ సహా అందరూ సీరియస్ గా డిస్ కస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా చార్లెట్ కూర్చొన్న కుర్చీ విరిగిపోయింది. అంతే.. ఢమాల్ మంటూ కిందపడింది. తాను లైవ్ మీటింగ్ లో ఉన్నాననే విషయం మరిచింది. వెంటనే తన కొలిగ్స్ తో ఇదంతా లైవ్ లో రికార్డ్ అయిందా? ఏంటి? అని అడిగింది.

దాంతో తోటి ఉద్యోగుల్లో అవును రికార్డు అవుతోందని అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ చమత్కరించారు. వెంటనే చార్లెట్ తన లైవ్ రికార్డు ఆపేసింది.. మరో కుర్చీ తెచ్చుకుని మీటింగ్ లో కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చార్లెట్‌ షేర్‌ చేశారు. ఇప్పుడా ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 1 లక్ష లైకులు వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో షేర్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు