UP Prisoners 10th Examination : 10th,ఇంటర్ పరీక్షలు రాసిన ఖైదీలు .. 95 శాతం మంది ఉత్తీర్ణత

జైళ్లలో శిక్ష అనుభవిస్తూనే పలువురు ఖైదీలు 10th,ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యారు.

UP jails  prisoners 10th Examination

UP jails  prisoners 10th Examination: ఉత్తరప్రదేశ్ లో 10th,ఇంటర్ పరీక్షలు రాసిన ఖైదీలు చక్కటి ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 25న విడుదల అయిన పరీక్షా ఫలితాల్లో ఖైదీలు చక్కటి ఉత్తీర్ణత సాధించారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తూనే పలువురు ఖైదీలు 10th,ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యారు.10th పరీక్షలు రాసిన ఖైదీల్లో 95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఉత్తర్‌ప్రదేశ్‌ జైళ్ల శాఖ తాజాగా ప్రకటించింది. అలాగే ఇంటర్ పరీక్షలు రాసిన ఖైదీల ఉత్తీర్ణత 70 శాతంగా ఉందని తెలిపింది.

60 మంది ఖైదీలు 10th పరీక్షలను రాయగా 57మంది పాస్ అయ్యారు. 64 మంది ఖైదీలు ఇంటర్ పరీక్షలు రాయగా 45మంది పాస్ అయ్యారు. మొదటి డివిజన్ మార్కులు సాధించిన వారి శాతం 82.40గా ఉంది. లక్నోలోని జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలు ఫస్ట్ డివిజన్ మార్కులు సాధించారు. అలాగే ఇంటర్ బోర్డు పరీక్షకు హాజరైన 64 మంది ఖైదీల్లో 45 మంది 70.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరుగురు ఖైదీలు (13.30 శాతం) మొదటి డివిజన్ మార్కులు సాధించారు.

జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పరీక్షలు రాయటానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వారికి అసవరమైన పుస్తకాలు అందించటం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జైల్లో ఉండే లైబ్రరీలో వారికి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అంతేకాదు వారు చదువుకోవటానికి వీలుగా తేలికపాటి పనులు అప్పగించేవారు. ఖైదీలు చదువుపై శ్రద్ధ పెట్టి పరీక్షలు రాయటానికి వీలు కల్పించారు. వారికి తగిన సమయం లభించటంతో చక్కగా చదువుకుని పరీక్షలు రాసి ప్రతిభ కనబరిచారు. కాగా 2022లో కూడా యూపీలోని పలు జైళ్లలో శిక్ష అనుభవించే ఖైదీలు 10th,ఇంటర్ పరీక్షలు రాశారు. చక్కటి ఉత్తీర్ణత సాధించారు.

 

ట్రెండింగ్ వార్తలు