Black Eyed Beans : రోగనిరోధక శక్తిని మెరుగుపరచటంతోపాటు, రక్తపోటును అదుపులో ఉంచే అలసందలు!

అలసందలో ఐరన్ ఉంటుంది, ఇది రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఆహారాలలో ఉండే మెగ్నీషియం వల్ల మన శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజకు ఒక కప్పు ఉడకబెట్టిన అలసంద గింజలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Black Eyed Beans : రోజువారిగా మనం తినే అనేక కూరగాయలలో అలసంద ఒకటి. వీటినే బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. వాటిలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. చౌకగా లబించే ప్రోటీన్ ఉన్న శాకాహారం. వీటిలో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసందలు లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులు మరియు వ్యాధులను నివారించడం సాధ్యపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయవచ్చు.

అలసందలో ఐరన్ ఉంటుంది, ఇది రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఆహారాలలో ఉండే మెగ్నీషియం వల్ల మన శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజకు ఒక కప్పు ఉడకబెట్టిన అలసంద గింజలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలసందలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిలో పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండెజబ్బులను నివారిస్తాయి.

అలసంద మొక్కలలో విటమిన్ కె లభిస్తుంది. ఇది గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఇది నరాలను ఉత్తేజపరుస్తుంది. అలసందలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మలబధ్ధకం సమస్యతో ఇబ్బంది పదుతున్నవారు రోజూ అలసంద గుగ్గిళ్ళు తింటే మల విసర్జ ఈజీగా అవుతుంది. అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హానిజరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు