Head Lice : తలలో పేల సమస్యతో బాధపడుతున్నారా!

తలలో పేలు ఉంటే దురద వస్తుంది. పేను గుడ్లు వెంట్రుకలకు అంటుకుని ఉంటాయి. అవి చాలా చిన్నగా కనిపించటం వల్ల చూడటం కష్టంగా ఉంటుంది. పేల కారణంగా జిల ఉత్పన్నమౌతుంది.

Head Lice : పేలు మనుషుల తలలో రక్తాన్నిపీల్చే చిన్న కీటకాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళల్లో జుట్టు అధికంగా ఉండటం కారణం చేత పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. తలలో పేలు పిల్లలను పెట్టి వాటి సంతతిని ఎక్కువగా పెంచుకుంటాయి. ఒకరి జుట్టు నుండి మరొకరి జుట్టుకు వ్యాపిస్తాయి. తలలో పేలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే కొన్ని లక్షణాల ద్వారా పేల సమస్యను గుర్తించవచ్చు.

తలలో పేలు ఉంటే దురద వస్తుంది. పేను గుడ్లు వెంట్రుకలకు అంటుకుని ఉంటాయి. అవి చాలా చిన్నగా కనిపించటం వల్ల చూడటం కష్టంగా ఉంటుంది. పేల కారణంగా జిల ఉత్పన్నమౌతుంది. దానిని నుండి ఉపశమనం పొందేందుకు చేతి వేళ్లతో తల కుదుళ్లపై భాగంలో గోకడం వంటివి చేయటం వల్ల కొన్ని సార్లు ఎరుపు రంగు గడ్డలు ఏర్పడటంతో బ్యాక్టీరియా బారిన పడే అవకాశాలు ఉంటాయి. తలలో పేలు ఉన్నట్లైతే కొన్ని రకాల గృహ చిట్కాలతోనే వాటిని సులభంగా తొలగించుకోవచ్చు.

పేలను నిరోధించుకోవటానికి కొబ్బరి నూనె పావు లీటరు, వేప గింజలు కప్పు తీసుకోవాలి. ముందుగా కొబ్బరినూనెను సన్నని సెగ మీద 20 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి నూనె వేడిగా ఉన్నప్పుడే వేప గింజలు వేసి వారం రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచేయాలి. దీనివల్ల చేదుగా ఉండే నూనె తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే పేల సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

అదేవిధంగా పేలను వదిలించుకునేందుకు దువ్వెనను ఉపయోగించి నివారించుకోవచ్చు. కొన్ని రకాల ఔషద షాంపులు, నూనెలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. వీటిని తలకు రాసుకోవటం ద్వారా పేల సమస్యను నివారించుకోవచ్చు. అయితే తలకు హానికలిగించని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు