Hydrated Food: సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటే ఈ ఫుడ్స్ బెటర్

సమ్మర్ వచ్చిందంటే చాలు.. వాతావరణం వేడెక్కడంతో పాటు శరీరం లోపలి భాగాలపై కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. బయట ఎండలో తిరిగి రాగానే చల్లని కూల్ డ్రింక్స్ తాగేద్దాం అనుకుంటారు...

Hydrated Food: సమ్మర్ వచ్చిందంటే చాలు.. వాతావరణం వేడెక్కడంతో పాటు శరీరం లోపలి భాగాలపై కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. బయట ఎండలో తిరిగి రాగానే చల్లని కూల్ డ్రింక్స్ తాగేద్దాం అనుకుంటారు. కానీ, అది చాలా ప్రమాదం. అందులో ఉండే కెమికల్స్ మాట అటుంచితే అవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచలేవు. అలాంటి పరిస్థితుల్లో బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే.. ఏం తినాలో.. ఏం తాగాలో ఓ సారి చూద్దాం.

Coconut Water

కొబ్బరి నీళ్లు
వేడిగా ఉన్న వాతావరణంలో కొబ్బరి నీళ్లు.. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో శరీరాన్ని సూపర్ ఫ్రెష్ గా ఉంచడమే కాకుండా, రీ ఎనర్జైజ్ చేస్తుంది. ఇందులో దాదాపు కొవ్వు శాతమనేదే లేకుండా, విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. అవే శరీరంలోని వేడిని సహజంగా తగ్గించేస్తాయి.

Celery

సెలరీ (కొత్తిమీర)
సాయంత్రం సమయంలో కొత్తిమీర కాడలతో పాటు యాపిల్ లేదా అరటిపండు కలిపి తీసుకోండి. వాటితో తాజా స్ట్రాబెర్రీస్ తినడం వల్ల హైడ్రేటెడ్ గా ఉండటమే కాక సమ్మర్ ను చల్లబరుస్తుంది. ఈ మొక్కలో న్యూట్రియంట్లతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగా దొరుకుతుంది.

Cucumber

కీర దోసకాయ
కీర దోసలో దాదాపు నీరే ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కూల్ గా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది చాలా లో క్యాలరీ ఫుడ్ కూడా. 100గ్రాముల కీర దోసలో 16 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

Buttermilk

మజ్జిగ
చిలికిన పెరుగులో నుంచి తీసిన మజ్జిగ చాలా ఇళ్లలో సహజమైన.. ఎక్కువగా వాడే హైడ్రేటెడ్ డ్రింక్. ఇది చాలా తేలికగా అనిపించి అరుగుదలకు కూడా బాగా హెల్ప్ అవుతుంది.

Watermelon

పుచ్చకాయ
సమ్మర్ లో వచ్చే పండ్లలో పుచ్చకాయలు, మామిడికాయలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయలో నీటి శాతంతో పాటు ఫైబర్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ స్థాయి కూడా సమృద్ధిగా ఉంటుంది.

Fenugreek Tea

మెంతులతో టీ
మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే మంచి హెల్ప్ అవుతుంది. మెంతిగింజలతో తయారుచేసే టీ బాడీ టెంపరేచర్ ను తగ్గించి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ట్రెండింగ్ వార్తలు