Bamboo rice Benefits : అరుదైన ‘వెదురు బియ్యం’తో ఎదురులేని ఆరోగ్య ప్రయోజనాలు..

అరుదైన ‘వెదురు బియ్యం’తో ఎదురులేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెదురు బియ్యం..వెదురు పిలకలు ఇలా వెదురు అంటేనే ఆరోగ్యాలనిచ్చి పెన్నిధి అని చెప్పుకోవచ్చు.

Health Benefits with Bamboo rice : వరి అన్నం తింటే బరువు పెరుగుతారని చపాతీలు..పుల్కాలు తింటుంటాం. కొంతమంది బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తింటుంటారు. కానీ మీకు వెదురు బియ్యం గురించి తెలుసా?అంత్యంత అరుదైన ఈ వెదురు బియ్యంతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలుంటాయో తెలుసా? బ్రౌన్ రైస్ కంటే అత్యంత ప్రయోజనకారి..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వెదురు బియ్యం గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి వెదురు బియ్యంలో ఎన్నో పోషకాలున్నాయి. సాధారణంగా అన్నం అంటే వరి బియ్యం అన్నమే అనుకుంటాం. అటువంటి వరి బియ్యం అన్నం భారతీయుల భోజనంలో మరేదీ భర్తీ చేయలేదు. ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు మూడు పూటలా అన్నంతో చేసిన ఆహారపదార్థాలనే తింటారు. అన్నం కావాలంటే (వరి బియ్యం) బియ్యం అవసరం.

మరి వరి నుంచి మాత్రమే బియ్యం వస్తాయని మనకు తెలుసు. కానీ వెదురు చెట్లు నుంచి కూడా బియ్యం పండుతాయని చాలామందికి తెలియదు. వెదురు బియ్యం చాలా అరుదైనవి. అలాని అన్ని వెదురు చెట్లు బియ్యం పండించలేవు. కొన్ని వెదురు జాతులు మాత్రం 50 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంటాయి.

వెదురు పొద లేదా చెట్లు పూతపూశాక వెదురు బియ్యం కంకులు వచ్చాయంటే.. అది చనిపోయే సమయం ఆసన్నమైనట్లే..! అంటే జీవితకాలంలో వెదురు చెట్లు ఒకే ఒక్కసారి పూస్తాయన్నమాట. అలా పూసిన చెట్లనుంచి బియ్యం వస్తాయి. అందుకే ఈ వెదురు బియ్యం చాలా అరుదైనవి. అద్భుతమైనవి. ఆరోగ్యాన్నిచ్చేవి. ఈ బియ్యాన్ని గిరిజనులు చాలా జాగ్రత్తగా సేకరిస్తుంటారు. వాటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు.

సాధారణ వరి బియ్యం మాదిరిగానే వెదురు చెట్లకు పూత వచ్చి కంకులు పడతాయి. 100 ఏళ్లకు ఒకసారి మాత్రమే వెదురు మొక్క పూస్తుంది. అడవుల్లో జీవించే గిరిజనులు కూడా తమ జీవితకాలంలో వెదురు పూతను అందరూ చూడరు. కొన్ని జాతులు 50 నుంచి 60 ఏళ్లకు ఒకసారి పూస్తుంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెప్తుంటారు.. పూతకు వచ్చి బియ్యం కంకులు వచ్చాయంటే వెదురు మొక్క చనిపోవడానికి సమయం ఆసన్నమైనట్లుగా గుర్తుంచుకోవాలి.

వెదురు బియ్యం ఎనలేని పోషకాలు..
వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తిన్నవారిలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుంది. విటమిన్‌ బీ6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, పీచు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని, బీపీని నియంత్రించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పులను చక్కటి ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గుదల..
వెదురు బియ్యాన్నే కాదు వెదురు పిలకను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. వెదురు పిలకలను ఉడికించి వంటల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు నీటిలో నానబెట్టి తర్వాత పచ్చడి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పులియబెట్టి వాడుతుంటారు. వెదురు పిలకలు శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా వాడుతుంటారు. వెదురు పిలకలో పిండిపదార్థాలు, ప్రోటీన్లతోపాటు కాపర్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి మూలకాలు, రైబోఫ్లెవిన్‌, విటమిన్‌ ఏ, కే, ఈ, బీ6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే ఫైటోప్టెరాల్స్‌, ఫైటోన్యూట్రియంట్స్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి.

ఈ పిలకల్లో క్యాలరీలు చాలా తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరం బరువును ఇట్టే తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నాడీసంబంధ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. గర్భిణీలు వీటిని తినడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని నిపుణులు చెప్తుంటారు. మధుమేహం, డిప్రెషన్‌, ఊబకాయం తగ్గడానికి కూడా వెదురు పిలకలు దోహదపడుతుంటాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు