Roudra Roopaya Namaha Review : ‘రౌద్ర రూపాయ నమః’ రివ్యూ.. ఓ సైకో నుంచి అమ్మాయిలు ఎలా తప్పించుకున్నారు?

రౌద్ర రూపాయ నమః సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. తాజాగా నేడు ఏప్రిల్ 12న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలయింది.

Roudra Roopaya Namaha Movie Review : కాలకేయ ప్రభాకర్(Kalakeya Prabhakar), మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ, తాగుబోతు రమేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రౌద్ర రూపాయ నమః’. కొత్త దర్శకుడు పాలిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా రావుల రమేష్ ఈ సినిమాని నిర్మించారు. రౌద్ర రూపాయ నమః సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. తాజాగా నేడు ఏప్రిల్ 12న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలయింది.

కథ విషయానికొస్తే.. ఆద్య(మోహన సిద్ది), తన చెల్లి(పాయల్ ముఖర్జీ), తాతయ్యలతో కలిసి ఉంటూ జాబ్ చేసుకుంటుంది. ఆద్యకు జాబ్ గోవాకు ట్రాన్ఫర్ అవ్వడంతో తన చెల్లితో కలిసి గోవాకు వెళ్తుంది. అక్కడ ఆఫీస్ క్వార్టర్స్ రెడీ అవ్వలేదని ఓ రెండు రోజులు ఆఫీస్ గెస్ట్ హౌస్ మోజా విల్లాలో ఉండమని ఆద్య మేడం చెప్పడంతో ఓకే అని అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆ విల్లాకు వెళ్తారు. వీళ్ళ విల్లా పక్కనే ఇంకో విల్లాలో మాజీ ఆర్మీ మేజర్(కాలకేయ ప్రభాకర్)ఉంటాడు. అతనికి మైండ్ లో బుల్లెట్ ఉండిపోవడంతో ఓ సమస్యతో ఉంటాడు. అతనికి ఎదురుగా ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకున్నా, అతను కోపంలో ఉన్నప్పుడు కనపడినా వాళ్ళని చంపేస్తూ ఓ సైకోలా ఉంటాడు.

ఆద్య చెల్లి కోసం తన లవర్ జై గోవాకు వచ్చి కలుస్తాడు. వెళ్లేముందు పక్క ఇంట్లో ఏదో జరుగుతుందని వీడియో తీసుకుంటూ జై లోపలికి వెళ్తాడు. అక్కడ మేజర్ తన భార్యని చంపేస్తూ ఉండటం చూసి జై షాక్ అవుతాడు. జైని గమనించిన మేజర్ అతన్ని కొట్టి ఇంట్లోనే దాస్తాడు. జై కోసం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ వెతుక్కుంటూ మేజర్ ఇంట్లోకి వెళ్తే అతని అసలు రూపం తెలుస్తుంది. అసలు మేజర్ కి ఉన్న సమస్య ఏంటి? అతను ఎందుకు అందర్నీ చంపుతున్నాడు? ఈ మధ్యలో అక్కాచెల్లెళ్ల ప్రేమ కథలేంటి? అక్కచెల్లు ఇద్దరూ మేజర్ దగ్గర చిక్కుకొని ఎలా బయటపడ్డారు? అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : Yash : బాలీవుడ్ ‘రామాయణం’ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యశ్.. నిర్మాతగా కూడా..

సినిమా విశ్లేషణ.. ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా కూడా ఇదే కోవలో వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో అక్క చెలెళ్ళు గోవాకు రావడం, అక్క చెల్లెళ్ళ ప్రేమ కథలు, మేజర్ అందర్నీ చంపడం చూపిస్తారు. ఇంటర్వెల్ కి జైని వెతుక్కుంటూ అక్కాచెల్లెళ్లు మేజర్ ఇంట్లోకి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి పెరుగుతుంది. సింపుల్ కథే అయినా కథనం కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. కాలకేయ ప్రభాకర్ క్యారెక్టర్ మీద సపరేట్ గా పాట ఉండటం గమనార్హం. ఒక ఐటెం సాంగ్ లిరిక్స్ బాగున్నా ఆ సాంగ్ ప్లేస్మెంట్ సెట్ అవ్వలేదు. సెకండ్ హాఫె లో కాసేపు తాగుబోతు రమేష్ దొంగగా వచ్చి నవ్విస్తాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. బాహుబలి సినిమాతో కాలకేయ ప్రభాకర్ విలన్ పాత్రలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. అక్కచెల్లెళ్లుగా నటించిన మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ తమ అందాలతో అలరిస్తూనే నటనలో కూడా ఓకే అనిపించారు. తాగుబోతు రమేష్ కాసేపు నవ్వించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ సీన్స్ లో బాగుంటుంది. కొన్ని చోట్ల మాత్రం డైలాగ్స్ ని డామినేట్ చేసేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సినిమా చాలా వరకు సింగిల్ లొకేషన్ లోనే షూట్ చేయడం విశేషం. చిన్న సినిమా అయినా దానికి తగ్గట్టు ఖర్చుపెట్టారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు