‘Boys will be boys’ ఇది క్షమించరాని తప్పు

  • Publish Date - May 5, 2020 / 02:38 PM IST

టీనేజర్ బాలిక లేవనెత్తిన గొంతుక దేశమంతా వినిపించింది. ఇద్దరు క్లాస్‍మేట్స్ తో పాటు మరికొందరు గ్యాంగ్ రేప్ గురించి గ్రూపులలో చర్చిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కంప్లైంట్ చేసింది. ఆ ట్వీట్ వైరల్ కావడంతో గ్రూపు డీయాక్టివేట్ చేశారు. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటామని మాటిచ్చారు. అంతేకాకుండా ముంబై పోలీసులు ట్వీట్ రూపంలో దానికి సరైన సమాధానమే చెప్పారు. 

“there is no room for disrespecting women”(మహిళలను అవమానపరచడానికి మీకు ఎలాంటి రూంలు లేవు) అని ట్వీట్ చేశారు. దాంతో పాటు పెద్ద అక్షరాలతో Boys lock ‘err’? అని పోస్టు పెట్టారు. పోస్టులో బాయ్స్ ఎప్పటికీ బాయ్సే.. ఇలాంటి తప్పును ముందెప్పుడూ క్షమించలేదు మరెప్పుడూ క్షమించము కూడా అని కామెంట్ పెట్టారు. 

ఈ  విషయంపై ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషస్ మొదలుపెట్టారు. ఆ టీనేజ్ బాయ్ ను ప్రశ్నించి విచారిస్తున్నారు. గ్రూపులో ఉన్న 18ఏళ్లు పైబడ్డ ఇతర సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ ఢిల్లీలోని 15ఏళ్ల స్కూల్ విద్యార్థి కూడా అందులో ఒక నిందితుడు. మొత్తం అందులో 22మంది వరకూ సభ్యులు ఉన్నట్లు అంచనా. 

ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. ఇనిస్టాగ్రామ్ గ్రూపులో ఉన్న ఏ ఒక్కరినీ వదలిపెట్టేది లేదన్నారు. అటువంటి వ్యక్తులు, లాక్‌డౌన్ లో ఉన్నా మరెక్కడున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 

ట్రెండింగ్ వార్తలు