Atchannaidu : ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై నమ్మకం లేదు,చంద్రబాబుకు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలి : అచ్చెన్నాయుడు

చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

Atchannaidu..

Atchannaidu..chandrababu treatment : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఆందోళన వ్యక్తంచేశారు..

ఈక్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతు..చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వయస్సుని, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎయిమ్స్ లేదా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు జైల్లో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తున్నారు.ఆయన ఉండే సెల్ అపరిశుభ్రంగా ఉందని అటువంటి చోట నిర్భంధించటం దారుణం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని..డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారని అన్నారు.

జైల్లో నా భర్తకు అవసరమైన అత్యవసర వైద్యం సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలం : నారా భువనేశ్వరి

ఇదిలా ఉంటే చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్ మాట్లాడుతు..చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చంద్రబాబు తనకు స్కిన్ కంప్లైంట్ ఉందని తెలిపారని ఈ విషయాన్ని రాజమండ్రి జీజీహెచ్చ సూపరింటెండెంట్ కు సమాచారం అందించామని..అక్కడి నుంచి డెర్మటాలజిస్టులు వచ్చి పరిశీలించారని వారు కొన్ని మెడిసిన్స్ రిఫర్ చేశారని వాటిని వాడుతున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందని వెల్లడించారు. తనకు డీహైడ్రేషన్ ఉందని చంద్రబాబు అన్నారు దీంతో ఆయన ఓఆర్ఎస్ వాడుతున్నారని తెలిపారు. ఏసీ ఇవ్వాలని డాక్టర్లు చెప్పలేదన్నారు. నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు