Roja Selvamani : మంత్రి రోజా కంటతడి.. ఈ పరిస్థితి రేపు లోకేశ్ భార్యకూ వస్తుందని సీరియస్ వార్నింగ్

మీ ఇంట్లో ఉన్న వారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. Roja Selvamani

Roja Selvamani Cries Out

Roja Selvamani Cries Out : టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళ అని కూడా చూడకుండా బండారు చాలా దారుణమైన కామెంట్స్ చేశారని వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో పోలీస్ కేసులు నమోదు కావడం, పోలీసులు బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై మంత్రి రోజా స్పందించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన రోజా.. బండారు సత్యనారాయణ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తలుచుకుని కంటతడి పెట్టారు.

నేను చెడ్డదాన్ని అయితే మీ పార్టీలో ఎందుకు పెట్టుకున్నారు?
” నా గురించి చాలా నీచంగా, హేయంగా మాట్లాడారు. ఎవరైనా అయన్ని చెప్పుతో కొడతారు. మాజీమంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, చివరికి నారా లోకేశ్ ఎందుకు స్పందించరు? మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? టీడీపీ ఓ సినిమా వ్యక్తి పెట్టిన పార్టీ. సినిమా వాళ్ళంటే లోకువా? మీ ఇంట్లో ఉన్న వారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? బండారు సత్యనారాయణ భార్య తన భర్తను చెప్పుతో కొట్టి ఉండాలి. సిగ్గు లేకుండా లోకేశ్ ట్వీట్ చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఎందుకు ప్రచారానికి పిలిచారు? నేను చెడ్డదాన్ని అయితే ఎందుకు పార్టీలో పెట్టుకున్నారు? ఐరన్ లెగ్ అని నన్ను అవహేళన చేశారు” అని వాపోయారు మంత్రి రోజా.

టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీ:
”అందరినీ ఇలానే మాట్లాడతారా? టీడీపీని వీడినప్పటి నుంచి ఇలానే నన్ను వేధిస్తున్నారు. మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. లోకేశ్ వీరిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి రేపు లోకేశ్ భార్యకూ వస్తుంది. బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలి. టీడీపీ.. తెలుగు దండుపాళ్యం పార్టీలా మారింది. టీడీపీలో మహిళలకు గౌరవం లేదు. ఏ మహిళకైనా మనసు ఉంటుంది. చేయని తప్పు శిక్ష వేస్తున్నారు. నేను చేసిన అభివృద్ధిపై నాతో చర్చకు రండి. అరెస్ట్ చేశారని బండారుని వదలను. ఆయనపై పరువు నష్టం దావా వేస్తాను” అని మంత్రి రోజా అన్నారు.

Also Read: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

ఆ రోజు నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారు:
”నేను అవమానపడి, రాజకీయంగా నష్టపోయి, కష్టాలు పడి, దండం పెట్టి మీ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేస్తే.. వచ్చిన రోజు నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అన్నారు. జగన్ కుటుంబసభ్యులు సహా అందరు లీడర్లకు మేసేజ్ లు పంపింది మీరు కాదా? అవేమీ పట్టించుకోకుండా జగనన్న నన్ను సొంత చెల్లెలిలా, విజయమ్మ తన కన్న కూతురిలా నన్ను ఆశీర్వదించి రాజకీయాల్లో నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి నా క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడిస్తున్నారు.

Also Read: ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?

ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే తిట్టించారు. మహిళలు తమకు నచ్చినట్టు బతకొచ్చని సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది. మీరెవరు నన్ను అడగటానికి? రాత్రి, పగలు నా కుటుంబం కోసం కష్టపడుతున్నా. ఎలాంటి తప్పు చేయకుండా, ఎవరి ముందు చేయి చాచకుండా, ప్రజల కోసం పని చేస్తున్నా. మహిళల హక్కుల కోసం, సాధికారత కోసం పోరాటం చేస్తున్నా. 20ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. మహిళలతో శభాష్ అనిపించుకున్నా. అలాంటి నా గురించి ఇంత నీచంగా మాట్లాడతారా?” అని మంత్రి రోజా తీవ్ర ఆవేదన చెందారు.

ట్రెండింగ్ వార్తలు