Cyclone Asani Warning : దూసుకొస్తున్న అసని తుఫాను.. ఏపీ ప్రజలకు హెచ్చరిక

అసని తుఫాను దూసుకొస్తోంది. అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.

Cyclone Asani Warning : అసని తుఫాను దూసుకొస్తోంది. అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అసని’ తుఫాను కొనసాగుతోందని.. రానున్న 6 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 10వ తేదీ నాటికి తుఫాను క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గర వస్తుందని తెలిపింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశాలోనే వాయవ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌ తెలిపారు.

Cyclone Asani: ముంచుకొస్తున్న ‘అసని’: తూర్పు తీరానికి తీవ్ర తుఫాను హెచ్చరిక

తుఫాను ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతూ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు