Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీనివాసుడి సుందర రూపాన్ని చూసి భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అర్చకులు అలంకరించారు.

Vaikuntha Ekadashi celebrations : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే దేవాలయాకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల తొలి గడప అయిన దేవుని కడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తారు. ఉత్తర ద్వారంలో గరుడ వాహానంపై అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిని దర్శించుకోనేందుకు క్యూ లైన్ లో భక్తులు బారులు తీరి నిల్చున్నారు.

విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీనివాసుడి సుందర రూపాన్ని చూసి భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని ఆలయ అర్చకులు అలంకరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులను అనుమతిస్తున్నారు. తెల్లవారుజామున మొదటి, రెండవ ధనుర్మాస ఆరాధన మహోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ కారణంగా గ్రామోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు.

Thirumala : వైకుంఠ ఏకాదశి వేడుకలు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారంలో బంగారు గరుడ వాహనంపై మంగళగిరి నరసింహ స్వామి దర్శనమిచ్చారు. ఉత్తరద్వార దర్శనం తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుంది. ఈరోజు, రేపు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రత్యేకమైన బంగారు దక్షిణావృత శంఖుతీర్ధ ప్రసాదం.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో(తూర్పు ద్వారం ద్వారా) వైకుంఠ ద్వార లక్ష్మీ నారసింహుడు దర్శనమిచ్చాడు. ఉదయం 6.49 నుంచి ఉదయం 9.00 గంటల వరకు దర్శనం ఇవ్వనున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో6.49 నుండి 9.00గంటల వరకు నరసింహుడి వైకుంఠ ద్వార దర్శనమిస్తారు.

CJI Justice NV Ramana : వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

పశ్చిమగోదావరి ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. గోవిందనామ స్మరణాలతో శేషాచల కొండ మార్మోగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని విజయవాడలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లబ్బీపేట వెంకటేశ్వరస్వామి, జిల్లాలోని ముఖ్య ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి వార్లను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు