Pawan Kalyan: విజయవాడలో వైసీపీ-జనసేన ఘర్షణ.. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏపీలోని విజయవాడలో వైసీసీ-జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. జెండా దిమ్మె విషయంలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.

Pawan Kalyan: ఏపీ, విజయవాడలో వైసీపీ-జనసేన మధ్య ఘర్షణ తలెత్తింది. వన్‌టౌన్‌లోని ఒక హోటల్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన జెండా గద్దె విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన దిమ్మెకు జనసైనికులు రంగులు వేసేందుకు ప్రయత్నించారు.

Bihar: మోకాలి లోతు వరద… డ్రమ్ములతో బోటు తయారు చేసి పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

అయితే, ఆ జెండా దిమ్మె తమ పార్టీకి చెందిందంటూ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. కొద్దిసేపు తోపులాట జరిగింది. వెంటనే స్పందించిన భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో జనసేన కీలక నేత పోతిన మహేష్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

Jubilee Hills rape case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం.. నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసుల పిటిషన్

అనంతరం పోతిన మహేష్‌ను విడుదల చేయాలని కోరుతూ జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పోతిన మహేష్ ఆరోపించారు.

 

ట్రెండింగ్ వార్తలు