ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈసీ సీరియస్.. పిన్నెల్లి గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశం!

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి..

Macherla MLA Pinnelli Ramakrishna Reddy : మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఈవోకు నోటీసులు పంపించింది. ఈవీఎం ధ్వంసం ఘటనపైనా సీఈవోను వివరణ కోరింది. ఈవీఎం ధ్వంసంకు పాల్పడింది ఎమ్మెల్యేనేనా అని ప్రశ్నించింది.. ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నిచింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Also Read : అందుకోసమే.. చంద్రబాబు విదేశాలకు వెళ్లారు- మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎంను ధ్వంసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా పిన్నెల్లి అరెస్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడకుండా ఆయన పరారైనట్లు తెలిసింది.

Also Read : ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ? 175 సీట్లు కన్‌ఫర్మ్- మంత్రి బొత్స

తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. ఏ సమయంలోనైనా పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి). ఆర్ పి యాక్ట్ 131, 135 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 147, 427, 353, 452 కింద రెండు నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉంది. దీంతో పిన్నెల్లి గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు