Hyderabad, Delhi airfares Hike : ఒడిశా రైలు ప్రమాదం తర్వాత విమాన టికెట్ల ధరలు మూడు రెట్లు పెంపు

ఒడిశా రైలు ప్రమాదం అనంతరం విమాన యానానికి రెక్కలు వచ్చాయి. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు....

Hyderabad, Delhi Airfares Hike: ఒడిశా రైలు ప్రమాదం అనంతరం విమానయాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటన తర్వాత(After Odisha train tragedy) రైళ్లలో ప్రయాణించడానికి భయాందోళనలు చెందుతున్న ప్రయాణికులు విమానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో విమానాల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు, న్యూఢిల్లీకి వెళ్లేందుకు(Hyderabad, Delhi) విమానం టికెట్ల ధరలు కేవలం గత ఐదు రోజుల్లోనే రెట్టింపు చేశారు.డిమాండ్ వల్ల విమాన టికెట్ల ధరల పెంపుదల మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని విమానయాన వర్గాలు వెల్లడించాయి.

IIT Kanpur research over heart attacks: కరోనా అనంతరం యువతలో గుండెపోటుకు కారణాలపై పరిశోధనలు

రైలు ప్రమాదం తర్వాత కోల్ కతా- చెన్నై మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో విమాన ప్రయాణ టికెట్ల ధరలు అమాంతం పెంచారు. అసలే వేసవి రద్దీ, దీనికి తోడు సెలవుల అనంతరం పాఠశాలలు తెరుస్తున్నందు వల్ల విమాన టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. రైళ్లను పునరుద్ధరించినా, రద్దీ దృష్ట్యా విమాన ప్రయాణ టికెట్ల ధరలు మాత్రం దిగి రాలేదు. రైలు ప్రమాదం జరగగానే ప్రయాణికులు ఎక్కువ మంది విమాన యానంపై ఆసక్తి చూపించారని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు.

Fire Breaks out at Hospital: ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..20 మంది నవజాత శిశువుల తరలింపు

విశాఖపట్టణం-హైదరాబాద్, విశాఖ- న్యూఢిల్లీ విమానాల్లో ప్రయాణించడానికి వచ్చే రెండురోజుల పాటు టికెట్లు లేవు. ప్రయాణికుల రద్దీ వల్ల ఆరు రోజులుగా విమాన టికెట్ల ధరలు పెరిగాయి.విశాఖ పట్టణం నుంచి హైదరాబాద్ నగరానికి విమాన ప్రయాణానికి టికెట్ల ధరలు మూడ రెట్లు పెరిగాయని ఓ ప్రయాణికుడు చెప్పారు.డైరెక్టు విమానాల్లో టికెట్లు దొరక్క విమాన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తిరుపతి, విజయవాడ, బెంగళూరు వెళ్లే విమానాల్లో టికెట్ల ధరలు 5 వేలరూపాయల నుంచి రూ.15వేలు, రూ.21వేలకు పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు