Today Gold Rate: భారీగా.. రూ.1700 పెరిగిన బంగారం ధర

బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరల్తో పసిడిప్రియులకు షాక్ తగిలినట్లు అయింది. 24 క్యారట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.1700 పెరిగింది.

Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరల్తో పసిడిప్రియులకు షాక్ తగిలినట్లు అయింది. 24 క్యారట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.1700 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ.1550 ఎగబాకింది.

నగల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర.. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.49వేల 350గా ఉంది. బుధవారంతో పోల్చితే రూ.350 పెరిగింది. ఒక్క గ్రాము రూ.4వేల 935 పలుకుతోంది.

పెట్టుబడుల్లో వినియోగించే 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం ధర.. హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 53వేల 840గా ఉంది. బుధవారంతో పోల్చితే రూ.390 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు న్యూఢిల్లీ ముంబై, కోల్‌కతా, బెంగళూరులో ఒకే ధరలకు బంగారం లభిస్తోంది.

ఈ ప్రాంతాల్లో 22 క్యారట్ల బంగారం తుల ధర రూ.49వేల 350, 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53వేల 840 పలుకుతోంది.

Read Also : స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి..!

కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి 10 రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు పెరిగ్గా.. ఒక్కసారి మాత్రమే తగ్గాయి. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74వేల 200కి చేరింది. బుధవారంతో పోల్చితే రూ.1500 పెరిగింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధరలు ఒకే ధరలు నడుస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు