Reliance Jio Ookla Awards : జియోనే నెం.1.. ఏకంగా 9 అవార్డులతో అగ్రస్థానం.. ప్రపంచంలోనే తొలి నెట్‌వర్క్..!

Reliance Jio Ookla Awards : ఊక్లా (Ookla) మెట్రిక్స్‌లో రిలయన్స్ జియో టాప్ (Reliance Jio No.1) టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. భారత టెలికం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ కన్నా జియో ముందంజలో కొనసాగుతూ మొత్తం 9 అవార్డులను గెల్చుకుంది.

Reliance Jio emerges as no.1 network in India with winning 9 Awards

Reliance Jio Ookla Awards : ప్రముఖ నెట్‌వర్క్ టెస్టింగ్ సంస్థ ఊక్లా (Ookla) మెట్రిక్స్‌లో రిలయన్స్ జియో (Reliance Jio) టాప్ టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. Q1 2023 నుంచి Q2 2023 మధ్య 5G డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ (Bharti Airtel)ను భారీ తేడాతో అధిగమించింది. తద్వారా జియో నెం.1 నెట్‌వర్క్‌గా అవతరించింది. భారత టెలికం మార్కెట్లో 5G నెట్‌వర్క్‌లకు సంబంధించిన అన్ని అవార్డులతో సహా మార్కెట్లో మొబైల్ నెట్‌వర్క్‌లకు మొత్తం 9 అవార్డులను గెలుచుకుంది.

ప్రపంచంలో ఏ టెలికం సర్వీస్ ప్రొవైడర్‌‌కు సాధ్యం కానీ రీతిలో జియో తొలిసారిగా ఫీట్ సాధించిందని ఓక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 9 అవార్డులలో బెస్ట్ మొబైల్ నెట్‌వర్క్, వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్, బెస్ట్ మొబైల్ కవరేజ్, టాప్ రేటెడ్ మొబైల్ నెట్‌వర్క్, ఉత్తమ మొబైల్ వీడియో ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ మొబైల్ గేమింగ్ ఎక్స్‌‌పీరియన్స్, ‘వేగవంతమైన 5G మొబైల్ నెట్‌వర్క్, బెస్ట్ 5G మొబైల్ వీడియో ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ 5G మొబైల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి ఉన్నాయి.

ఎయిర్‌టెల్ కన్నా జియోనే టాప్ స్కోరు :
5G మొబైల్ నెట్‌వర్క్ మెట్రిక్‌లో.. Q1 2023 నుంచి Q2 2023 మధ్యకాలంలో జియో 5G డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో జియో 335.75 స్కోర్ చేయగా, భారతి ఎయిర్‌టెల్ 179.49 స్కోర్ చేసింది. జియో 5G వినియోగదారులు మధ్యస్థ డౌన్‌లోడ్ స్పీడ్ 416.55Mbps (ఎయిర్‌టెల్ 213.3Mbps), మధ్యస్థ అప్‌లోడ్ స్పీడ్ 21.20Mbps (ఎయిర్‌టెల్ 19.83 వర్సెస్)తో యాక్సస్ పొందారు.

Read Also : Reliance Jio Annual Plans : రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీగా చూసేయొచ్చు!

జియో (Jio 5G) వినియోగదారులు ముంబైలో అత్యధిక డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌ను వరుసగా 432.97Mbps, 19.12Mbps కలిగి ఉన్నారు. ఎయిర్‌టెల్ 5G వినియోగదారులు ముంబైలో అత్యధిక డౌన్‌లోడ్ స్పీడ్ 269.63Mbps, బెంగళూరులో అత్యధికంగా 30.83Mbps అప్‌లోడ్ వేగాన్ని అందుకున్నారు. జియో ట్రూ 5G నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

అత్యధిక అవార్డులు పొందిన తొలి నెట్‌వర్క్ ఇదే :
5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 85శాతాన్ని కంపెనీ విస్తరించింది. కస్టమర్‌లకు స్పీడ్, వీడియో, గేమింగ్‌లో అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడంలో జియో ప్రయత్నాల్లో విజయం సాధించిందని, అందుకే ఈ అవార్డులతో భారత్‌లో అత్యధికంగా అవార్డులు పొందిన నెట్‌వర్క్‌గా నిలిచిందని జిఫ్ డేవిస్ సెక్షన్ Ookla ప్రెసిడెంట్, CEO స్టీఫెన్ బై అన్నారు.

Reliance Jio Ookla Awards

రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ‘డిజిటల్ సొసైటీని రూపొందించడంలో జియో టెక్నాలజీపరంగా అనేక అద్భుతాలు సాధించిందని, అందరి జీవితంలో, ప్రతి రంగంలో సానుకూల మార్పుకు దారితీసింది. ఈ విప్లవానికి సహకరించడం మా అదృష్టం. ఈ విజన్‌ని నిజం చేయడానికి పూర్తి స్థాయిలో విజయం సాధించాం’ అని ఆయన అన్నారు.

ఏడాదిలోనే 50 మిలియన్ల 5G యూజర్లు :
జియో ‘డిజిటల్ ఇండియా పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని అంబానీ తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ అగ్రగామిగా మారడంలో జియో సాయపడిందని తెలిపారు. డిసెంబర్ 2023 నాటి కాలపరిమితి కన్నా ముందే దేశంలో ట్రూ 5G నెట్‌వర్క్‌తో కవర్ చేసామని అన్నారాయన. 5G విస్తరణలో 85శాతం జియో మాత్రమే ఉందని టెలికాం కంపెనీ ప్రతి 10 సెకన్లకు ఒక 5G సెల్‌ని అమలు చేయడం కొనసాగిస్తుందని జియో ఛైర్మన్ తెలిపారు.

జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ 5G నెట్‌వర్క్ రోల్‌అవుట్‌లను త్వరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండు టెల్కోలు తమ 5వ జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్‌లను ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 50 మిలియన్ల 5G వినియోగదారుల మైలురాయిని సాధించినట్లు పేర్కొన్నారు. మూడవ స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ లాంచ్ కోసం ఇంకా ఎలాంటి ప్లాన్‌లను ప్రకటించలేదు.

Read Also : Flipkart Big Dusshera Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు