Extra Marital Affair : ఒకటే హృదయం కోసమూ ఇరుపురుపోటీ ఏలనో…. అని సినిమా పాటలు పాడుకునే రోజులు…. ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడి తర్వాత ఒకళ్ళు త్యాగం చేయటం అలాంటివి సినిమాల్లో చూస్తుంటాం… నిజ జీవితంలోకి వచ్చేసరికి ఒక మహిళతో వివాహేతర సంబంధం కోసం పొటీపడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
ఫలక్ నుమా పోలీసు స్టేషన్ పరిధిలోని అచ్చిరెడ్డినగర్ కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ పర్వేజ్(230 అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కాగా అదే మహిళతో గుల్జార్ నగర్ కు చెందిన షేక్ అబ్బాస్ (25) అనే వ్యక్తి కూడా ఏడాదిన్నరగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
Also Read : Illegal Marriages : ఒకరికి తెలియకుండా ఒకరిని… నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ తంబి
ఏకకాలంలో మహిళ ఒకరికి తెలియకుండా ఒకరిని మేనేజ్ చేస్తూ కాలం నెట్టుకొస్తోంది. ఇటీవల ఈ విషయం పర్వేజ్ కు తెలిసింది. అబ్బాస్ తో మాట్లడవద్దని అతడితో బంధాన్ని వదిలించుకోమని మహిళను మందలించాడు. అందుకు ఆమె ఏమీ ప్రతిస్పందించక పోయేసరికి అబ్బాస్ ను హత్య చేయాలని పర్వేజ్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నవాబ్ సాహెబ్ కుంటకు చెందిన తన స్నేహితుడు షేక్ అక్రం(24)తో కలిసి ప్లాన్ వేశాడు.
ఈనెల 1వ తేదీ రాత్రి అబ్బాస్ కు ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని బయటకు పిలిచాడు. ఇంటినుంచి కొద్ది దూరం వెళ్లగానే అక్రం అబ్బాస్ ను గట్టిగా పట్టుకోగా పర్వేజ్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అబ్బాస్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి తల్లి ఖదీర్ బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.