#DriveLikeALady : బ‌స్సు న‌డిపి డ్రైవ‌ర్ ప్రాణాలు కాపాడిన యోగితా సతావ్ స్ఫూర్తితో కొట‌క్ మహీంద్రా బ్యాంక్ యాడ్‌ వైరల్

బ‌స్సు న‌డిపి డ్రైవ‌ర్ ప్రాణాలు కాపాడిన పూణెకు చెందిన యోగితా సతావ్ స్ఫూర్తితో కొట‌క్ మహీంద్రా బ్యాంక్ యాడ్‌ రూపొందించింది. ఆ యాడ్ వైరల్ అవుతోంది. ఈ యాడ్ తో యోగితా మరోసారి వైరల్ గా.

International Women’S Day 2022 ..Kotak mahindra bank#DriveLikeALady Add : బస్సు నడుపుతుండగా హఠాత్తుగా డ్రైవ‌ర్ స్పృహ కోల్పోయిన ఘటనలో ఆ బస్సులోనే ఉన్న పూణెకు చెందిన యోగితా స‌తావ్ సడెన్ గా డ్రైవింగ్ సీట్లో కూర్చుని బస్సును నడిపి డ్రైవర్ తో పాటు తోటి వారిని కూడా కాపాడి వైరల్ క్వీన్ అయ్యారు. గత జనవరిలో జరిగిన ఈ ఘటనతో స్ఫూర్తి పొందిన కొటక్ మహీంద్రా బ్యాంక్ యోగితాను స్పూర్తిగా తీసుకుని ఓ అడ్వర్ టైజ్ మెంట్ రూపొందించింది. #DriveLikeALady అనే పేరుతో రూపొందించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : International Women’S Day : హైదరాబాద్ పోలీస్ చరిత్రలో మొదటిసారిగా మహిళా సీఐకి SHO గా బాధ్యతలు

అప్పటి వరకు బస్సు ఎలా నడుపుతారో కూడా తెలియిని 42 ఏళ్ల యోగితా డ్రైవర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోవటంతో ఆమెతో పాటు బస్సులో చాలామందే ఉన్నారు. అందరూ భయపడిపోయారు. ఆ సమయంలో తనకు బస్సు నడపటం రాకపోయినా యోగితా చొరవతో బస్సు స్టీరింగ్ పట్టుకుని అత్యంత సురక్షితంగా బస్సు నడిపి అటు డ్రైవ‌ర్ ప్రాణాల‌ను కాపాడి రియల్ హీరో గా ప్రశంసలు పొందారు. డ్రైవర్ ప్రాణాలతో పాటు తోటి వారిని కూడా కాపాడిన యోగితా సోషల్ మీడియాడలో క్వీన్ అయిపోయారు.

ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న కొటక్ మహేంద్ర బ్యాంకు జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కోసం కొత్త యాడ్‌ను రూపొందించింది. డ్రైవ్‌లైక్ఏలేడీ(#DriveLikeALady) అనే హ్యాష్‌టాగ్‌తో యాడ్‌ను రూపొందించి యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీంతో ఆ యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు మ‌రోసారి యోగితాను గుర్తు చేసుకొని త‌ను చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

Also read : Chiranjeevi: నా విజయం వెనుకున్నది సురేఖనే.. మహిళా దినోత్సవ సంబరాల్లో చిరు

కాగా గత జ‌న‌వ‌రి 7న మినీ బ‌స్సులో యోగిత‌తో పాటు మ‌రో 20 మంది మ‌హిళ‌లు బస్సులో పిక్‌నిక్ వెళ్లారు. ఈక్రమంలో బ‌స్సు డ్రైవ్ చేస్తూ.. డ్రైవ‌ర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయాడు. దీంతో వెంట‌నే ప్ర‌మాదం గ‌మ‌నించిన యోగిత‌.. బ‌స్సు స్టీరింగ్ ప‌ట్టుకొని బ‌స్సును డ్రైవ్ చేసి.. స‌కాలంలో బ‌స్సును ఆసుప‌త్రి ద‌గ్గ‌రికి వెళ్లేలా చేసారు. ఆమె సాహసంతో బ‌స్సు డ్రైవ‌ర్ ప్రాణాలతో పాటు తోటి మహిళల ప్రాణాలు కూడా కాపాడారు యోగితా.

Also read : Women’s Day 2022: స్పెషల్ స్లైడ్స్‌తో..మహిళలకు గొప్పదనాన్ని చాటిచెప్పిన గూగుల్ డూడుల్‌

అప్ప‌టి వ‌ర‌కు యోగితా బ‌స్సు న‌డ‌ప‌నే లేదు. కానీ ఆ సమయంలో ఆమెకు ఆ విషయమే గుర్తురాలేదు. ఎలాగోలా డ్రైవ‌ర్ ప్రాణాలతో పాటు తోటిమహిళల ప్రాణాలు కాపాడాలనే తపనతో సాహసం చేసి అందరి ప్రాణాలు కాపాడారు.అలా 35 కిలోమీట‌ర్లు బ‌స్సు న‌డిపారు యోగితా. ఆ సాహసంతో యోగితా ఏకంగా బ్రాండెడ్ కంపెనీ కొటక్ మహేంద్రాకు స్ఫూర్తి అయిపోయారు.#DriveLikeALady పేరుతో కొటక్ మహేంద్రా రూపొందించిన యాడ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు