Reuters Report: ఒక్క ట్రంప్ తప్ప అమెరికా అధ్యక్షులంతా బానిస యజమానులే, ఒబామా కూడా

ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 11 మంది గవర్నర్లు, 100 మంది కాంగ్రెస్ సభ్యులు బానిస హోల్డర్ల ప్రత్యక్ష వారసులని దర్యాప్తులో వెల్లడైంది. బానిస యజమానులతో అనుసంధానించబడిన కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులలో కనీసం 28 శాతం రిపబ్లికన్లు, 8 శాతం డెమొక్రాట్‌లు ఉన్నారు.

US Presidents: ఒక్క డొనాల్డ్ ట్రంప్ తప్ప ఇప్పటి వరకు అమెరికాకు అధ్యక్షులైన వారంతా అందరూ నల్ల జాతీయుల్ని బానిసలుగా మార్చిన పూర్వీకుల నుంచి వచ్చినవారేనని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ చేసిన పరిశోధనలో తేలింది. ఇందులో కనీసం ఒక్క బానిసనైనా వీరి పూర్వీకులు కలిగి ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది. నల్లజాతీయుడైన బరాక్ ఒబామా కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. ఆయన పూర్వీకులు బానిసల నాయకుడిగా పని చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. తల్లి వైపు కుటుంబీకులు బానిసల యజమానిగా పని చేశారట.

KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

అయితే డొనాల్డ్ ట్రంప్ పూర్వీకులు 1865లో బానిసత్వం రద్దు చేయబడిన తర్వాత అమెరికాకు వలస వచ్చారని రాయిటర్స్ నివేదించింది. రాజకీయ ప్రముఖుల వంశాలను కనుగొనడానికి వేల పేజీల పత్రాలలో ఉన్న సమాచార ముక్కల ద్వారా డేటా క్రోడీకరించబడింది. ప్రస్తుతం బతికున్న అమెరికా అధ్యక్షులు అయిన జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా, జో బిడెన్‭లు అందరూ బానిస హోల్డర్ల ప్రత్యక్ష వారసులని దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

UK PM Rishi Sunak Pen : రిషి సునక్ పెన్నుపై వివాదం, అసలు ఏంటా పెన్ను..? ఎందుకీ ఆందోళన..?

వారితో పాటు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 11 మంది గవర్నర్లు, 100 మంది కాంగ్రెస్ సభ్యులు బానిస హోల్డర్ల ప్రత్యక్ష వారసులని దర్యాప్తులో వెల్లడైంది. బానిస యజమానులతో అనుసంధానించబడిన కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులలో కనీసం 28 శాతం రిపబ్లికన్లు, 8 శాతం డెమొక్రాట్‌లు ఉన్నారు. సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్‌కానెల్, సెనేటర్ లిండ్సే గ్రాహం, ఎలిజబెత్ వారెన్, టామీ డక్‌వర్త్‌లు కూడా బానిస హోల్డర్ల వారసులే.

ట్రెండింగ్ వార్తలు