UK PM Rishi Sunak Pen : రిషి సునక్ పెన్నుపై వివాదం, అసలు ఏంటా పెన్ను..? ఎందుకీ ఆందోళన..?

ప్రధాని మంత్రి రిషి సునాక్ వాడే పెన్నుపై నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సునాక్ అధికారిక కార్యక్రమాల్లోను..అధికారిక పత్రాల్లో సంతకాలు పెట్టేందుకు వినియోగించే పెన్నుపెద్ద చర్చకే దారి తీసింది.

UK PM Rishi Sunak Pen controversy : బ్రిటన్‌ (Britain )ప్రధాని రిషి సునక్ (Rishi Sunak)ను వివాదాలు వీడటంలేదు. ఈ సారి సునక్ ‘పెన్ను’(pen)వివాదంలో చిక్కుకున్నారు. రిషి సునక్‌ (Rishi Sunak)అధికారికంగా వినియోగించే పెన్నుపై వివాదం,ఆందోళనలు వస్తున్నాయి. సునక్ ఛాన్సలర్‌(Chancellor)గా ఉన్నప్పనుంచి అదే పెన్ను వినియోగిస్తున్నారు. ప్రధాని అయిన తరువాత కూడా అదే పెన్ను వినియోగిస్తున్నారు. ఈ పెన్ను వినియోగంపై అధికారులు,నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనికి కారణం ఏంటీ? అసలు ఏంటా పెన్ను..ఈ పెన్ను వినియోగంపై ఎందుకంత ఆందోళన..?

ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సునక్ వరుసగా ఏదోక విషయంలో వివాదంలో చిక్కుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో పెన్ను వినియోగం పెద్ద చర్చకే దారి తీసింది. రిషి సునక్ వాడే పెన్నుపై బ్రిటన్‌లో ఉన్న నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పెన్ను ఎరేజబుల్‌ ఇంక్‌ (erasable ink pen)పెన్ను అని చెబుతున్నారు. అటువంటి పెన్ను అధికారిక కార్యకలాపాల్లో వినియోగించటం వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. యూకేలో ఈ పెన్నులు 4.75పౌండ్లు (UK pounds)అంటే భారత కరెన్సీలో రూ.495లు. ఈపెన్నుల్లో మీద “ఎరేసబుల్ ఇంక్” (erasable ink)లోగో ఉంటుంది. ఈ పెన్నులను జపనీస్ స్టేషనరీ కంపెనీ (Japanese stationery company)విక్రయిస్తుంటుంది.

Tunnel Raod in Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ నియంత్రణకు మెగా సొరంగ మార్గం.. 65 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు

బ్రిటన్ ప్రధాని హోదాలో ఉన్ని రిషి సునక్ ఎరేజబుల్ ఇంక్ (erasable ink pen )వాడుతున్నారని పలు మీడియాలో వెల్లడిస్తున్నాయి. ఆ పెన్నుతో ఏం రాసినా దాన్ని తుడిచివేసి మళ్లీ రాసుకునే వెలుసుబాటు ఉండటం ఆ పెన్ను ప్రత్యేకత. కానీ బ్రిటన్ ప్రధాని హోదాలో ఉన్న సునక్ ఎన్నో విలువైన, కీలకమైన సంతకాలు పెట్టాల్సి ఉంటుంది.అధికారిక పత్రాల్లో ఎరేజబుల్ ఇంక్ పెన్ను వినియోగింటం వల్ల ఇబ్బందులు వస్తాయని నిపుణులు, అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రిషి సునక్ ఛాన్సలర్ గా ఉన్న సమయంలో డిస్పోసబుల్‌ పైలట్‌ వి పెన్ను(disposable Pilot V pens)లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడాయన ప్రధాని పదవిలో ఉన్నారు. ప్రధాని అయిన తర్వాత కూడా అవే పెన్నులను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారని అంటున్నారు అధికారులు. 15 రోజుల క్రితం బ్రిటన్ మంత్రివర్గ సమావేశంలో కూడా సునాక్‌ చేతిలో ఇటువంటి పెన్ను కన్పించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్‌ పొలిటికల్‌ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపై కూడా రిషి సునక్ ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. దీంతో ఈ పెన్నుపై వివాదం, తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ (10 Downing Street) గోప్యతకు మంచిదికాదంటున్నారు.

Delhi : ఉబర్ హీరో.. తన సేవా గుణంతో ప్రయాణికుల మనసు దోచుకున్న క్యాబ్ డ్రైవర్

ఈ పెన్నుతో ఏది రాసినా దాన్ని తుడిచివేసే సౌకర్యం ఉంటుంది. అదే ఇప్పుడు భద్రతాపరంగా అనేక అనుమానాలకు దారితీస్తోంది. రిషి సునక్‌ అటువంటి పెన్ను వినియోగిస్తున్నారని మరి ముఖ్యంగా ఆ పెన్నును అధికారిక పత్రాల్లో రాసిన అంశాలను ఎవరైనా కావాలని తొలగించే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సునక్ పెట్టిన సంతకాలను కూడా ఎవరైనా మార్చి రాసే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పెన్నులు రాజకీయ నేతలు వినియోగించటం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ఎరేజబుల్ ఇంక్ పెన్నుల వివాదంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ (10 Downing Street)వర్గాలు స్పందిస్తు..రిషి సునక్ (Rishi Sunak)అధికారిక పత్రాలు అన్నింటిని సేఫ్టీగానే ఉంచుకుంటారని వెల్లడించింది. ఇటువంటి పెన్నులను సివిల్ సర్వీస్ లో అధికారులు ఎక్కువగా వినియోగిస్తుంటారని సునక్ కార్యదర్శి (secretary )వెల్లడించారు. ఇటువంటి పెన్నులతో రాసిన రాతలను సునక్ ఎప్పుడు చెరిపివేయలేదని కనీసం అటువంటి యత్నం కూడా చేయలేదని స్పష్టంచేశారు. భవిష్యత్తులో కూడా అలా చేయరని వెల్లడించారు.

Bihar : జీన్స్, టీషర్టులు ధరించి ఆఫీసులకు రావద్దు : విద్యాశాఖ ఆదేశాలు

 

ట్రెండింగ్ వార్తలు