Russia ukraine war : నికోలివ్ మిలటరీ ఎయిర్ బేస్ పై రష్యా రాకెట్ దాడి..మహిళలు, చిన్నారులతో సహా 40మంది మృతి

రష్యా యుక్రెయిన్ లోని నికోలివ్ మిలటరీ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. ఈ దాడిలో 40మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులతో సహా 40మంది మృతి చెందారు.

Russia’s attack on Nikolaev military air base kills 40 people : యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. దాదాపు 25 రోజుల నుంచి యుద్ధంతో విరుచుకుపడుతున్న రష్యాను శక్తికి మించి ఎదుర్కొంటోంది యుక్రెయిన్. అయినా రష్యా ఏమాత్రం తగ్గటంలేదు. యుక్రెయిన్ కూడా రష్యాకు బదులు చెబుతునే ఉంది. రష్యా సేనలు పలు నగరాలు..గ్రామాలపై విరుచుకుపడుతున్న క్రమంలో నికోలివ్ మిలటరీ ఎయిర్ బేస్ పై రష్యారాకెట్  దాడి చేసింది. ఈ దాడిలో 40మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులతో సహా 40మంది మృతి చెందారు. కీవ్, ఖర్కీవ్, పోల్ పై రష్యా మిస్సైళ్ల వర్షంతో విరుచుకుపడుతోంది.

Also read : Russia Ukraine war : రాజీ ఫార్ములా కొస్తున్నరష్యా ?

యుక్రెయిన్‌ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్‌ సిటీపై భీకర దాడులు చేసింది. లెవివ్‌ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి.

రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్‌పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని యుక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్‌స్క్‌ సిటీలో ఇళ్లపైనా రష్యా క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది. ఖర్కీవ్‌లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్‌లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్‌లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్‌ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్‌మెంట్‌లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.

Also read : Nobel for Ukraine President: నోబెల్ శాంతి బహుమతికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు ప్రతిపాదన

 

 

ట్రెండింగ్ వార్తలు