Heartbreaking Pics : తిండి,నీళ్లు లేక చనిపోయిన జిరాఫీలు..చావు అంచుల్లో 4,000 మూగజీవాలు

తిండి,నీళ్లు లేక జిరాఫీలు చనిపోయాయి. తీవ్రమైన కరవుతో మరో 4,000 జిరాఫీలు చావు అంచుల్లో ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Six Giraffes Dying In Drought Stricken Kenya : మనిషి అయినా మూగ జీవాలైనా ఆకలితో చనిపోవటం కంటే దారుణమైన ఘటన మరొకటి ఉంటుందా? గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీరు లేక..వాన చినుకు జాడే లేక ప్రాణాలు కోల్పోవటం కంటే దారుణం ఏమైనా ఉంటుందా? దాహం వేస్తే గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు లేక మూగజీవాలు అల్లాడి ఆకలితో నకనకలాడి చనిపోయిన ఘటన ఆఫ్రికా దేశ కెన్యాలో చోటుచేసుకుంది. తిండి, నీరు లేక ఎన్నో జిరాఫీలు చనిపోయిన పడి ఉన్న చిత్రాలు గుండెల్ని మెలిపెట్టేస్తున్నాయి. నీటి కోసం మైళ్లకొద్దీ దూరాలు నడిచి నడిచి నీటి జాడే లేక దారిలోనే చనిపోయిన జిరాఫీల ఫోటోలు మనసుల్ని కదిలించేస్తున్నాయి.

Read more :  Elephant released on parole : హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏనుగుకు విడుదల : పెరోల్ పై పార్కుకు తరలింపు

వాన జాడ లేక..చుక్క నీరు కురవకపోవటంతో నీళ్లు లేక..తిండి దొరక్క మూగజీవాల మృత్యు ఘోష పెడుతున్నాయి. ఆరు జిరాఫీలు తిండి లేక..నీరు లేక ఒకే చోట పడి చనిపోయిన హృదయ విదారక చిత్రాలు వైరల్ గా మారాయి. ఈ అత్యంత దారుణ ఘటన వాజిర్ లోని సాబూలీ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీలో చోటు చేసుకుంది. కెన్యా ఉత్తర ప్రాంతంలో గత సెప్టెంబర్ నుంచి సాధారణ వర్షపాతం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం కూడా వర్షాలు కురకపోతే ఇక నీరు ఎక్కడనుంచి వస్తుంది? దీతో కరవు తాండవించింది. దాహంతో గొంతు పిడిచకట్టుకుపోతుంటే జిరాఫీలు నీటి కోసం మైళ్లకొద్దీ దూరాలు నడిచాయి. అయినా ఎక్కడా నీటి చుక్క కనిపించలేదు.

నీళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్లిన జిరాఫీలు కన్జర్వెన్సీలోని ఓ రిజర్వాయర్ లోకి వెళ్లాయి. అందులోని ఓ బరుదమడుగులో కూరుకుపోయి బయటకు రాలేకపోయాయి. దీంతో తిండి..నీళ్లు లేక అలమటించి అవి ప్రాణాలు వదిలాయని వాజిర్ లోని సాబూలీ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలను అక్కడి సిబ్బంది తెలిపారు. ఆరు జిరాఫీలూ ఒకే చోట చనిపోయిన ఆ ఫొటో లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Read more : Elephant Pays Tribute: మావటి మృతి..కన్నీరు పెట్టుకుని ఘన నివాళి అర్పించిన గజరాజు

సెప్టెంబర్ నుంచి కెన్యా ఉత్తరప్రాంతంలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో కరవు తాండవిస్తోంది. ఆహారం, నీళ్ల కొరత తీవ్రంగా ఉంది. పాడి పశువులకు గ్రాసం కూడా దొరకడం లేదు. ఇక వన్యప్రాణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పెంపుడు జంతువులకు వాటి యజమానులు ఎలాగోలాగా కనీసం నీరు అందించవచ్చు. కానీ వన్యప్రాణులకు ఈకరవు మరణఘోషగా మారుతోందని మరిన్ని వన్యప్రాణులు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని బౌర్ ఆల్జీ జిరాఫీ శాంక్చువరీ ఉద్యోగి ఇబ్రహీం అలీ ఆవేదన వ్యక్తం చేశారు. నదీ తీరాల్లో పంట పొలాల వల్ల జిరాఫీలకు నీళ్లు దొరకటంలేదన్నారు.

ఈ కరవుతో గరిస్సా కౌంటీలోని 4 వేల జిరాఫీలకు ప్రమాదం పొంచి ఉందని..వారి ప్రాణాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఓ నివేదిక చెబుతోంది. ఈ కరవును జాతీయ విపత్తుగా ప్రకటించారు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా. అందులో భాగంగా కరవు ప్రభావం పడిన 25 లక్షల మందికి ఎమర్జెన్సీ రిలీఫ్ క్యాష్ ట్రాన్స్ ఫర్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రకటించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు