Raj Patel Wine on Menu: మోదీ డిన్నర్ మెనూలో గుజరాతీ రాజ్‌పటేల్ రెడ్ వైన్

అమెరికా వైట్‌హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లు మోదీ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందు మెనూలో గుజరాతీ తయారు చేసిన రెడ్ వైన్ చోటుచేసుకుంది.....

Raj Patel Wine on Menu of PM Modi Dinner: అమెరికా వైట్‌హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లు మోదీ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందు మెనూలో గుజరాతీ తయారు చేసిన రెడ్ వైన్ చోటుచేసుకుంది.భారత ప్రధానమంత్రి మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో అద్భుతమైన శాఖాహారం మెనూ ప్రత్యేకంగా రూపొందించారు. (PM Modi US Visit 2023)ఈ విందులో, గుజరాత్ నుంచి యూఎస్‌కి వచ్చిన రాజ్ పటేల్ యాజమాన్యంలోని నాపా వ్యాలీ వైనరీ నుంచి అతిథులకు పటేల్ రెడ్ బ్లెండ్ 2019 కూడా అందించారు.(Wine by Gujarat-born Raj Patel)

PM Modi In US Congress:ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయం..యూఎస్ కాంగ్రెస్ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు

వైన్ వ్యాపారంలో ఫ్రెంచ్, ఇటాలియన్ బ్రాండ్లు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో భారతీయ రాజ్ పటేల్ వైన్ బ్రాండ్ చాలా అరుదు.మోదీకి ఇచ్చే విందు కోసం రాజ్ పటేల్ తన పటేల్ వైన్స్ నుంచి రెడ్ వైన్ అందించాలని సాక్షాత్తూ వైట్ హౌస్ కోరింది.

Titanic submarine:టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం..ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన

అయితే పటేల్‌ను స్వయంగా ఆహ్వానించలేదు. మమ్మల్ని కేవలం వైన్ సరఫరా చేయమని అడిగారని రాజ్ పటేల్ చెప్పారు. తాను భారతీయ గుజరాతీ మూలానికి చెందిన వ్యక్తిని, తాను తయారు చేసిన రెడ్ వైన్ కు మోదీ విందు మెనూలో చేర్చడం పట్ల రాజ్ పటేల్ ఆనందం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు