Indra : 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇంద్ర.. అప్పటి రికార్డులు.. కేవలం 5 టికెట్స్ 10 వేల రూపాయిలకి కొన్నారు..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇంద్ర 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ఈ మూవీ అప్పటిలో ఎన్ని రికార్డులు, రివార్డులు సాధించిందో తెలుసా..?

21 years of Chiranjeevi Indra movie records collections list in telugu

Chiranjeevi – Indra : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘ఇంద్ర’. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు సౌత్ అండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని అప్పటి సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2005లో రజినీకాంత్ ‘చంద్రముఖి’ రిలీజ్ అయ్యేవరకు ఈ రికార్డు అలానే ఉంది. అలాగే ఆ ఏడాది ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా షారుఖ్ ఖాన్ ‘దేవదాస్’ నిలిస్తే.. దాని తరువాత సెకండ్ ప్లేస్ లో ఇంద్ర నిలిచింది.

KTR Birthday : కేటీఆర్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. మహేష్ బాబు, రామ్ చరణ్..

ఇక థియేటర్స్ విషయానికి వస్తే.. తెలుగు, కన్నడ, ఒడిశా స్టేట్స్ తో కలిపి ఇండియా వైడ్ 268 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. 151 సెంటర్స్ లో 50 రోజులు ఆడి రికార్డు సాధించింది. వీటిలో 9 కర్ణాటక, 2 ఒడిశాలోని థియేటర్స్. ఇక 100 రోజులు 122 సెంటర్స్ లో ప్రదర్శించగా 4 కర్ణాటకలోనివి కావడం విశేషం. ఇంద్రసేనుడి ప్రభంజనం అక్కడితో ఆగిపోలేదు 32 సెంటర్స్ లో 175 రోజులు, ఆదోని సత్యం థియేటర్ లో 247 రోజులు రన్ అయ్యి రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా హిందీలో ‘ఇంద్ర ది టైగర్’ అనే పేరుతో డబ్ అయ్యి బాలీవుడ్ టెలివిజన్ లో ప్రసారం అయ్యింది. హిందీ టెలివిజన్ కూడా ఈ మూవీ అద్భుతాలు సృష్టించింది. 2015 లో ఒక నేషనల్ మీడియా ఈ మూవీ గురించి ఇలా రాసుకొచ్చింది.. “హిందీ టెలివిజన్ రంగంలో ‘ఇంద్ర ది టైగర్’ సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నట్లు కనిపిస్తుంది” అంటూ ఆ మూవీ బాలీవుడ్ టెలివిజన్ లో ఎంతటి హిట్టుగా నిలిచిందో చెప్పుకొచ్చింది. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ఈ మూవీ మూడు నంది అవార్డ్స్, రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.

Suriya : తెలుగు స్టార్ హీరో రేంజ్‌లో సూర్య బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆంధ్రాలో 1500 పైగా బైక్స్‌తో ర్యాలీ.. వీడియో వైరల్!

కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 2 కోట్లకు పైగా టికెట్స్ సెల్ అయ్యినట్లు సమాచారం. అప్పటిలో టికెట్ ధర 5రూ, 10రూ కాబట్టి 40 కోట్ల దగ్గర కలెక్షన్స్ ఆగిపోయింది. ఇప్పటి రోజుల్లో అయితే సింపుల్ గా 350 నుంచి 400 కోట్లు కొల్లగొడుతుంది. అంతేకాదు ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ బట్టి టికెట్స్ ధరని పెంచుతుంటారు. కానీ ఆ సమయంలో అలా ఉండేది కాదు. అయితే అప్పటిలో బ్లాక్ టికెట్ల దందా ఉండడంతో చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమాలకు బ్లాక్ లో అప్పటిలోనే ఒక్కో టికెట్ 500రూ పలికేవి.

ఈ క్రమంలోనే మ‌ద‌నప‌ల్లికి చెందిన ఒక వ్యక్తి ఇంద్ర సినిమాకు ఏకంగా ఒక్కో టికెట్ ని 2000 పెట్టి కొన్నాడట. మొత్తం 5 టికెట్స్ ని ప‌ది వేల రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేశాడట. ఈ విషయాన్ని ఇంద్ర మూవీ దర్శకుడు బి గోపాల్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కాగా ఈ సినిమా 30 కోట్లకు పైగా షేర్ అందుకున్న మొట్టమొదటి మూవీగా ఇంద్ర నిలిచి అప్పటి ఇండస్ట్రీ హిట్టు అయ్యింది. ఈ రికార్డుని 2006లో వచ్చిన మహేష్ బాబు పోకిరి మూవీ బ్రేక్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు