Kedarnath Google Translate : కేదార్‌నాథ్‌లో తప్పిపోయిన ఏపీ మహిళ.. ఎట్టకేలకు కుటుంబంతో కలిపిన గూగుల్ ట్రాన్స్‌లేట్.. ఇంతకీ, వృద్ధురాలు ఎలా కలిసిందంటే?

Kedarnath Google Translate : కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 68ఏళ్ల వృద్ధురాలు తప్పిపోయింది. కేదార్‌నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కుటుంబం నుంచి విడిపోయింది. గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా ఎలా కమ్యూనికేట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Kedarnath Google Translate : కేదార్‌నాథ్ తీర్థయాత్రకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వెళ్లివస్తుంటారు. కేదార్‌నాథ్‌కు తీర్థయాత్ర (Kedarnath Temple)కు వెళ్లే క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. తద్వారా అనేక ఇబ్బందులు ఎదురుకావొచ్చు. చాలామంది తీర్థయాత్రలో తప్పిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి ఒంటరిగి మిగిలిపోతుంటారు. అక్కడి అధికారుల సాయంతో ఎవరో ఒకరు తమ కుటుంబాలను కలుస్తూనే ఉంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవల జరిగింది.

కేదార్‌నాథ్ తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఏపీ (ఆంధ్రప్రదేశ్)కి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు అలాగే తప్పిపోయింది. పవిత్ర స్థలం అందాలను ఆస్వాదించేందుకు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కేదార్‌నాథ్ తీర్థయాత్రకు వెళ్లింది.అక్కడి నుంచి తిరిగివస్తుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆమె కుటుంబ సభ్యుల నుంచి విడిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో కుటుంబ సభ్యులను విడిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగు భాష మాత్రమే తెలిసిన ఆ మహిళ అక్కడి వారితో కమ్యూనికేట్ కాలేకపోయింది. అక్కడి భాష మాట్లాడలేక ఒంటరిగా సాయం కోసం ఎదురుచూసింది.

చివరికి టెక్నాలజీని ఉపయోగించి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంది. గూగుల్ ట్రాన్స్‌లేట్ (Google Translate) సాయంతో ఆమె తన కుటుంబంతో కలిసింది. భాష తెలియక పోయినా ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా అక్కడి అధికారులతో కమ్యూనికేట్ చేయగలిగింది. ఆ మహిళ ఆంధ్ర‌ప్రదేశ్‌కి చెందినవారు. తెలుగు బాగా తెలుసు. కానీ, హిందీ లేదా ఇంగ్లీషులో కమ్యూనికేట్ చేయలేకపోయింది.

Read Also : Paytm UPI Lite : ఐఫోన్ యూజర్లు పేటీఎంలో యూపీఐ PIN లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

గూగుల్ ట్రాన్స్‌లేట్‌తో కమ్యూనికేట్ :
నివేదిక ప్రకారం.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కేదార్‌నాథ్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె తన కుటుంబం నుంచి విడిపోయింది. గౌరీకుండ్‌ షటిల్‌ పార్కింగ్‌ స్థలంలో ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించిన పోలీసులు ఆరా తీశారు. పోలీసు అధికారులతో హిందీ లేదా ఇంగ్లీషులో ఆమె కమ్యూనికేట్ చేయలేకపోయింది. ఆమె హావభావాలను అర్థం చేసుకున్న పోలీసులు.. మహిళ తన కుటుంబంతో మళ్లీ కలిసిపోతుందని హామీ ఇచ్చినట్టు సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ చంద్ర బెల్వాల్ తెలిపారు. మహిళతో మాట్లాడటానికి ప్రయత్నించామని, తెలుగులో మాత్రమే మాట్లాడుతోందని ఎస్‌ఐ చెప్పారు. పోలీసులకు ఆమె చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవడానికి పోలీసులు గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

Kedarnath Google Translate : 68-year-old woman from Andhra Pradesh separated from family in Kedarnath

వృద్ధురాలి కుటుంబాన్ని గుర్తించిన పోలీసులు :
ఆ మహిళ తెలుగులో చెప్పిన ఫోన్ నంబర్‌కు పోలీసులు డయల్ చేయగా.. వృద్ధురాలు ఒంటరిగా ఉన్న గౌరీకుండ్‌కు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోన్‌ప్రయాగ్‌లో ఆమె కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా, 68 ఏళ్ల వృద్ధురాలి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులతో పోలీసులు కమ్యూనికేట్ అయ్యారు. మహిళ కుటుంబీకుల ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహిళను తిరిగి తన కుటుంబంతో కలిపేందుకు సోన్‌ప్రయాగ్‌కు తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.

గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎలా ఉపయోగించాలంటే? :
గూగుల్ ట్రాన్స్‌లేట్ 100 కన్నా ఎక్కువ భాషల మధ్య టెక్స్ట్ ఈజీగా ట్రాన్స్‌లేట్ చేయగలదు. మీరు (Google Translate) వెబ్‌సైట్ లేదా యాప్‌లో Text టైప్ చేయవచ్చు లేదా రాయవచ్చు. గూగుల్ ట్రాన్సులేట్ మీకు నచ్చిన భాషలోకి Text ట్రాన్స్‌లేట్ చేస్తుంది. మీ భాష అర్థం కాని వారితో మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే… గూగుల్ ట్రాన్స్‌లేట్ ఓపెన్ చేసి మీ డివైజ్ మైక్రోఫోన్‌లో మీ భాషలో ఏదైనామాట్లాడవచ్చు.

అప్పుడు గూగుల్ ట్రాన్స్ లేట్ మీరు పలికిన పదాన్ని మీకు నచ్చిన భాషలోకి అనువదిస్తుంది. Android, iOS డివైజ్‌ల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ మిమ్మల్ని టెక్స్ట్ ట్రాన్స్‌లేట్ చేయడానికి లేదా ఏదైనా భాషలో మాట్లాడిన పదాన్ని కావాల్సిన భాషలోకి సులభంగా ట్రాన్స్‌లేట్ చేయగలదు. రియల్ టైంలో మాట్లాడే సంభాషణలను ట్రాన్స్‌లేట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Read Also : Nokia C22 Launch : అద్భుతమైన కెమెరాలతో నోకియా C22 ఫోన్.. కేవలం రూ. 7,999 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు