AAP MLA : ఎమ్మెల్యే భర్తమీద కేసు పెట్టిందని ‘తల్లీబిడ్డల్ని’ దారుణంగా కొట్టిన దుండగులు.. వీడియో

దేశరాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లీకూతురిపై కర్రలు, ఐరన్ రాడ్‌తో దాడికి తెగబడ్డారు.

AAP MLA : దేశరాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లీకూతురిపై కర్రలు, ఐరన్ రాడ్‌తో దాడికి తెగబడ్డారు. వీరి దాడిలో తల్లీకూతుర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 19న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చదవండి : AAP on Modi Govt: ‘మోదీ ప్రభుత్వ ఫేవరేట్ ఏజెన్సీ నుంచి లవ్ లెటర్ వచ్చింది’

నవంబర్ 19 సాయంత్రం సమయంలో కారులో బయటకు వెళ్లిన తల్లి కూతుర్లు రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటిముందు కారు నిలిపి ఇంట్లోకి వెళ్లేందుకు యువతి కిందకు దిగింది.. అప్పటికే కాచుకొని ఉన్న కొందరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి యువతిపై దాడి చేశారు.. వీరిలో ఓ మహిళకూడా ఉంది. కూతురుపై దాడి చేస్తుండటంతో కారులోంచి దిగి అడ్డుకునే ప్రయత్నం చేసింది తల్లి.. దీంతో ఆమెపై కూడా దాడి చేశారు.

చదవండి : Delhi Pollution..Schools Closed: ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..మరోసారి స్కూల్స్ మూసివేత..

కర్ర, రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశారు. యువతిపై పిడిగుద్దులు కురిపించారు. తమను కాపాడాలని కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. 11 రోజుల చికిత్స అనంతరం వారు నవంబర్ 30న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

చదవండి : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం పంజాబ్ లో..పంజాబ్ సీఎం ఢిల్లీలో..ఏప్రిల్-1 తర్వాత రైతుల ఆత్మహత్యలుండవ్

మహిళలపై దాడి చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 19 రాత్రి ఆప్ ఎమ్మెల్యే బందన కుమారికి తెలిసిన వ్యక్తులు నాతో పాటు నా కుమార్తెపై దాడి చేశారని 38 ఏళ్ల బాధితురాలు తెపింది. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది.

చదవండి : Arvind Kejriwal : ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత నాలుగు హామీలు

తాను ఎమ్మెల్యే చేసిన తప్పులను బయటపెట్టానని.. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి అని ఆ మహిళ తెలిపింది. దేశ రాజధానిలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఎమ్మెల్యేను ఆమె అనుచరులను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశంపై అధికారపార్టీ నేతలెవరూ మెదపలేదు.

ట్రెండింగ్ వార్తలు