Acharya: ధర్మస్థలి కోసం స్థలాన్ని మార్చిన ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య, ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ.....

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య, ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటం విశేషం.

Acharya: భలే భలే బంజారా సాంగ్ ప్రోమో.. కేకపెట్టించిన చిరు-చరణ్!

ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఇక ఈ క్రమంలోనే ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా తొలుత ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌కు మార్చినట్లుగా తెలుస్తోంది.

Acharya : ఆచార్యలో చరణ్, కాజల్ లెంగ్త్‌కి కత్తెర పడనుందా??

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరి ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు