Allu Arha : ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ఎన్టీఆర్ దేవర సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటించబోతుంది. ఇక కేవలం 10 నిముషాలు రోల్ కోసం అర్హకి ఇస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Allu Arha charged 20lakhs remuneration to act in ntr devara

Devara – Allu Arha : ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంటే సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హ కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సమంత ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది అర్హ.

OG Movie : పవన్ లేకుండానే జరుగుతున్న OG షూటింగ్.. 50 డేస్..!

ఇప్పుడు తన రెండో సినిమాగా ఎన్టీఆర్ చిత్రంలో కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో జాన్వీ చిన్నపాటి పాత్రని అల్లు అర్హతో చేయించడానికి దర్శకుడు కొరటాల భావించి అల్లు అర్జున్ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ మధ్య మంచి స్నేహం ఉండడంతో బన్నీ కూడా వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో అర్హ పాత్ర కేవలం పది నిముషాలు మాత్రమే ఉంటుంది. అయితే ఈ 10 మినిట్స్ రోల్ కోసం అర్హకి ఇస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Namrata : మహేష్ తనయుడు ‘గౌతమ్‌’ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నమ్రతా.. ఆ తరువాతే హీరోగా..!

ఈ సినిమాలో నటించినందుకు అర్హకి ఒక్కో నిమిషానికి 2 లక్షలు ఇవ్వబోతున్నారట. 10 నిముషాలు రోల్ కావడంతో మొత్తానికి అర్హ ఈ సినిమాలో నటించినందుకు 20 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియదు గాని.. కేవలం పది నిమిషాల పాత్రకే, అది జస్ట్ రెండో సినిమాకే అర్హ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా దేవర మూవీ యూనిట్ తాజాగా 5వ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు