Mechanic Rocky : థియేటర్లలో దీపావళి మోతె అంటున్న విశ్వక్ సేన్.. మెకానిక్ రాకీ నుంచి అదిరిపోయే అప్డేట్..
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు హీరో విశ్వక్సేన్.
- Thota Vamshi Kumar
- Updated on- July 18, 2024 / 06:17 PM IST
Vishwak Sen Mechanic Rocky Release date Announced
Mechanic Rocky Release date : జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు హీరో విశ్వక్సేన్. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. డెబ్యూ డైరెక్టర్ రవితేజ్ ముళ్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం అదరిపోయే అప్డేట్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో విశ్వక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ధియేటర్లలో దీపావళి మోత మోగడం ఖాయమని అంటున్నారు.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి వారు తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీపావళి ఇంకా చాలా టైమ్ ఉండడంతో విశ్వక్తో ఎవరు పోటీపడతారో త్వరలోనే తెలియనుంది.
MAA : తెలంగాణ డీజీపీకి ‘మా’ ఫిర్యాదు.. ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం
